పదికి ప్రత్యేక కసరత్తు
వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
నిజాంసాగర్(జుక్కల్): పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలే లక్ష్యంగా జిల్లా విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. విద్యార్థుల్లో విద్యాసామర్థ్యాలు పెంచి, వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా సన్నద్ధం చేస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతోపాటు గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పదోతరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
జిల్లాలో 13,617 మంది విద్యార్థులు
జిల్లాలోని 306 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతోపాటు గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 13,617 మంది విద్యార్థులు పదోతరగతి చదువుతున్నారు. పబ్లిక్ పరీక్షలకు ముందుగానే ఆయా పాఠశాలల్లో విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం సాయంత్రం వేళలో సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పాఠ్యాంశాల్లో సందేహాలను నివృత్తి చేస్తున్నారు. నవంబర్ నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించేలా విద్యాశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణతను సా ధించడమే లక్ష్యంగా విద్యార్థు లను పరీక్షలకు సిద్ధం చేస్తున్నాం. సబ్జెక్టుల వారీగా సిలబస్ పూర్తి చేయడంతోపాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక క్లాసులు ఉంటాయి.
– రాజు, జిల్లా విద్యాశాఖ అధికారి
పబ్లిక్ పరీక్షలకు విద్యార్థుల సన్నద్ధం
ఉదయం, సాయంత్రం
వేళల్లో స్పెషల్ క్లాసులు
చదువులో వెనుకబడిన
వారిపై ప్రత్యేక శద్ధ
వందశాతం ఉత్తీర్ణతే
లక్ష్యంగా విద్యాశాఖ చర్యలు
పదికి ప్రత్యేక కసరత్తు


