రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం
కామారెడ్డి అర్బన్: స్మారక క్రీడలు నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహించడం అభినందనీయమని జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎం.చంద్రకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి శ్రీ సరస్వతి శిశుమందిర్ మైదానంలో ఆదివారం సాయంత్రం సీహెచ్ శ్రీనివాస్ స్మారక రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పోటీలకు ఆయా జిల్లాల నుంచి 15 జట్లు పాల్గొన్నాయి. మొదటి మ్యాచ్‌లో కామారెడ్డి జిల్లా బొల్లారం, సిద్దిపేట జట్లు తలపడ్డాయి. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి హీరాలాల్, కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు సీహెచ్ రాజు, గడీల భాస్కర్, అథ్లెటిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ఎం.జైపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్, నర్సింలు, మనోహర్‌రావు, రాజలింగం తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం


