దాడులు తెలియక.. యథావిధిగా..
మద్నూర్(జుక్కల్): మద్నూర్ మండలం సలాబత్‌పూర్ వద్ద ఉన్న ఆర్టీవో చెక్‌పోస్ట్‌పై శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే, ఒకవైపు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నా.. ఆ విషయం తెలియని లారీ డ్రైవర్లు చెక్‌పోస్టు వద్ద ఏర్పాటు చేసిన డబ్బాలో యథావిధిగా డబ్బులు వేస్తూ కనిపించారు. ఆ డబ్బులను ఓ ప్రయివేటు వ్యక్తి ఎప్పటికప్పుడు తీసుకెళ్లడాన్ని ఏసీబీ అధికారులు గమనించారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదిక పంపించామని ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ తెలిపారు. చెక్‌పోస్ట్‌లలో అవినీతి జరుగుతున్నట్లు తమ దృష్టికి రావడంతో ప్రభుత్వానికి నివేదించామని, దీంతో త్వరలో అన్ని చెక్‌పోస్ట్‌లను ఎత్తివేయనున్నట్లు పేర్కొన్నారు. ఇకపై చెక్‌పోస్ట్‌లలో అక్రమాలు జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక యాప్ తయారు చేసి ఆ యాప్‌పై లారీ డ్రైవర్లకు అవగాహన కల్పించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు.


