రాష్ట్ర నాయకత్వానికి నివేదిక అందిస్తాం
● డీసీసీ అధ్యక్ష పదవి కోసం
30 దరఖాస్తులు
● ఏఐసీసీ పరిశీలకుడు రాజ్‌పాల్ కరోల
కామారెడ్డి టౌన్: జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం 30 దరఖాస్తులు అందాయని, ప్రతి ఒక్కరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర నాయకత్వానికి నివేదిక అందిస్తామని ఏఐసీసీ పరిశీలకుడు రాజ్‌పాల్ కరోల అన్నారు. డీసీసీ అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకున్న 30 మంది నాయకులతో శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో రాజ్‌పాల్ సమావేశమయ్యారు. ఒక్కోక్కరితో ప్రత్యేకంగా సుదీర్ఘంగా చర్చించి అభిప్రాయాలు సేకరించామని, వారి అభిప్రాయాలు, సలహాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశామని ఆయన తెలిపారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు ఇలియాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్కంఠ..
డీసీసీ పదవికి నాయకుల నుంచి పోటీ బాగానే ఉంది. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల నుంచి నాయకులు డీసీసీ పదవిని ఆశిస్తున్నారు. ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించిన కరోల నాలుగు నియోజకవర్గాల్లో నాయకుల అభిప్రాయాలను సేకరించారు. జిల్లా అధ్యక్ష పదవి ఎవరిని వరించెనో అని ఉత్కంఠ నెలకొంది.


