రైతులకు సహకరించాలి
కామారెడ్డి క్రైం: రైతులకు మద్దతు ధర వచ్చేలా వరి కోతల సమయంలో హార్వెస్టర్ల యజమానులు నాణ్య తా ప్రమాణాలు పాటించాలని జిల్లా వ్యవసాయ అ ధికారి మోహన్‌రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని నరసన్నపల్లి వద్దనున్న రవాణా శాఖ కార్యాలయంలో జిల్లాలోని హార్వెస్టర్‌ల యజమానులు, డ్రైవర్లకు శనివారం అవగాహన సదస్సు నిర్వ హించారు. ఈ సందర్భంగా డీఏవో మాట్లాడుతూ.. ఖరీఫ్‌లో 3.18 లక్షల ఎకరాల్లో వరిసాగు అ య్యిందని, ఈ సమయంలో రైతులకు వ్యవసాయ కూలీలు, హార్వెస్టర్ వాహనదారుల సహకారం ఎంతో ముఖ్యమన్నారు. పంట కోతల సమయంలో అధికారుల సూచనలను పాటించాలన్నారు. డీటీవో శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి మధుమోహన్, ఎంవీఐ శ్రీనివాస్, ఏడీఏ ప్రసన్న, అధికారులు, సిబ్బంది, హార్వెస్టర్ల యజమానులు, డ్రైవర్లు పాల్గొన్నారు.
నిజామాబాద్‌అర్బన్: రెవెన్యూ శాఖలో పలువురు ఉద్యోగులను కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి డిప్యుటేషన్‌పై బదిలీ చేశారు. ఇటీవల రేషన్‌కార్డుల జారీలో అనేక అక్రమాలు జరిగినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ జిల్లా అధికారులకు నివేదించారు. దీంతో విచారణ చేపట్టిన అధికారులు ఆయా మండలాల్లో అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించారు. అయి తే, వారిపై సస్పెన్షన్ వేటు వేయాల్సి ఉండగా, బది లీలతో సరిపెట్టడం చర్చనీయాంశంగా మారింది. రెంజల్ తహసీల్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ గౌతంను జిల్లా కలెక్టర్ కార్యాలయానికి, బోధన్ తహసీల్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ సుమంత్‌ను జిల్లా కేంద్రంలోని టీజీఎస్‌సీఎస్‌సీఎల్‌కు, ఇందల్వాయి ఆర్‌ఐ దండి మోహన్‌ను టీజీఎస్‌సీఎస్‌సీఎల్‌కు, సిరికొండ ఆర్‌ఐ గంగరాజంను నిజామాబాద్ సౌత్ మండలానికి, ధర్పల్లి ఆర్‌ఐ రవిని ఎడపల్లికి, నిజామాబాద్ సౌత్ మండల ఆర్‌ఐ నవాజ్‌ను బోధన్ తహసీల్ కార్యాలయానికి డిప్యుటేషన్‌పై పంపించారు.


