కాంటాలు, గన్నీ బ్యాగులు లేవు
తక్కువ ధరకు విక్రయించి నష్టపోవద్దు
పచ్చి ధాన్యాన్ని విక్రయించాను
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని గ్రామాల్లో వరికోతలు ప్రారంభమయ్యాయి. కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు ప్రారంభం కాలేదు. గత 15 రోజుల క్రితమే కలెక్టర్ ఆదేశాలతో అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో అధికారులు ప్రారంభించారు.కేంద్రాల్లో ఇప్పటికి వరకు కాంటాలు, గన్నీ బ్యాగులు అందుబాటులో లేవు.మండలంలో 21,200 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. మండల పరిధిలో మొత్తం 37 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కానుండగా, అందులో 25 ఐకేపీ ఆధ్వర్యంలో, 12 కేంద్రాలు గాంధారి, ముదెల్లి సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అధికారులు ముందు జాగ్రత్తగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా అందుకు తగిన ఏర్పాట్లు ఇప్పటికీ చేయలేదు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యానికి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,389 ఉండగా, రైస్ మిల్లు వ్యాపారులు పచ్చి ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ. 1800–1850 కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు నష్టపోతున్నారు. అధికారులు తొందరగా కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.
అధికారుల ఆదేశాల మేరకు గత 15 రోజుల క్రితమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాము. వరి కోతలు ఇప్పుడే ప్రారంభం అయ్యాయి. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి ఆరబెట్టే వరకు కేంద్రాల్లో కాంటాలు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంటాయి. రైతులు తొందర పడి పచ్చి ధాన్యాన్ని తక్కువ ధరకు విక్రయించి నష్టపోవద్దు.
– ఏవో రాజలింగం, గాంధారి
వాతావరణ పరిస్థితులకు భయపడి పచ్చి వడ్లను రైస్ మిల్లు వ్యాపారికి విక్రయించాను. అధికారులు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఇప్పటికీ కేంద్రంలో కాంటాలు, గన్నీ బ్యాగులు లేవు. ధాన్యం ఆరబోసినా తేమ శాతం వచ్చిన తరువాత వర్షం పడితే మళ్లీ తడిసిపోయి నష్టం జరిగే అవకాశం ఉంది. అందుకే కొంత మేర నష్టం జరిగినా ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో పచ్చి ధాన్యం విక్రయించాను.
– నాగ్లూర్ గంగాధర్ రైతు, గాంధారి
గాంధారి మండలంలో అధికారికంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
మొదలైన వరికోతలు
పచ్చి ధాన్యాన్ని నేరుగా రైస్‌మిల్లు
వ్యాపారులకు విక్రయిస్తున్న రైతులు
కాంటాలు, గన్నీ బ్యాగులు లేవు
కాంటాలు, గన్నీ బ్యాగులు లేవు


