సాదాసీదాగా ప్రజావేదిక
మాచారెడ్డి: ఉపాధి హామీ పనులకు సంబంధించిన ప్రజావేదిక శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో అడిషనల్ డీఆర్డీవో వామన్ రావు ఆధ్వర్యంలో సాదాసీదాగా కొనసాగింది. ఉమ్మడి మాచారెడ్డి మండలంలోని ఆయా గ్రామాల్లో 1 ఏప్రిల్ 2024 నుంచి 31మార్చి 2025 వరకు జరిగిన పనులకు సంబంధించి ఈ నెల 10 నుంచి 17వరకు సామాజిక తనిఖీ సిబ్బంది చేపట్టిన వివరాలను ప్రజావేదికలో వెల్లడించారు. చిన్న చిన్న సాంకేతిక లోపాలు మినహా పనులన్నీ సవ్యంగా సాగినట్లు సిబ్బంది వివరించారు. ఏడాది కాలంలో మొత్తం 730 పనులకు గానూ రూ 20.10 కోట్లు వ్యయమైనట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో గోపిబాబు, ఎంపీవో తిరుపతిరెడ్డి, ఏపీవో ప్రశాంత్, శ్రీనివాస్ ఉన్నారు.
ప్రజాప్రతినిధులు లేని ప్రజావేదిక..
ఎప్పుడైనా ఉపాధిహామీ సామాజిక తనిఖీ ప్రజావేదికలకు ప్రజాప్రతినిధులు హాజరవుతారు. ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగియడంతో అధికారులే తమ సిబ్బందితో సామాజిక తనిఖీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో సిబ్బంది ఉన్నారు.
ఉమ్మడి మాచారెడ్డి మండలంలో
730 పనులకు గానూ
రూ.20.10కోట్ల వ్యయం


