ధాన్యం సేకరణ సమర్థవంతంగా చేపట్టాలి
● డీసీవో రామ్మోహన్
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): కొనుగోలు కేంద్రాలలో ధా న్యం సేకరణ సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా సహకార శాఖ అధికారి రామ్మోహన్ సూచించారు. నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెద, గోలిలింగాల, లింగంపల్లి కలాన్, నాగిరెడ్డిపేట, తాండూర్, కిచ్చన్న పేట గ్రామాలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రాలకు చేరిన ధాన్యం తేమ శాతాన్ని డీసీవో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో 427 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయ గా, సహకార శాఖ ఆధ్వర్యంలో 233, ఐకేపీ ఆధ్వర్యంలో 194 కేంద్రాలను ప్రారంభించారన్నారు. ఖరీఫ్‌లో 5,99,212 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరుగుతుందని అంచనా వేశామన్నారు. మరో మూడు రోజులలో ధాన్యం సేకరణ ప్రారంభమవుతుందని తెలిపా రు. ఆయన వెంట ఎల్లారెడ్డి క్లస్టర్ అధికారి శ్రీనివాస్, మాల్తుమ్మెద, తాండూర్ సొసైటీల సీఈవోలు సందీప్, చంద్రమురళి తదితరులు ఉన్నారు.


