కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఽరైతులు తాము పండించిన ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. దళారులకు విక్రయించి నష్టపోవద్దని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన వరి పంటకు మద్దతు ధర పోస్టర్లను ఆయన శుక్రవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డీఎం శ్రీకాంత్, డీసీఎస్‌వో వెంకటేశ్వర్లు, డీఆర్డీవో సురేందర్ తదితరులు పాల్గొన్నారు.


