కూటమి కుట్రలపై వెల్లువెత్తిన నిరసన
కామారెడ్డి టౌన్/ బాన్సువాడ/బాన్సువాడ రూరల్ / నిజాంసాగర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షి దిన పత్రిక, ఎడిటర్ ధనంజయ రెడ్డిపై కూటమి ప్రభు త్వం అక్రమ కేసుల నమోదుపై ప్రజా సంఘాలు, జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట శుక్రవారం రాత్రి కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కామారెడ్డి జేఏసీ కన్వీనర్ జగన్నాథం మాట్లాడుతూ ఏపీలో నకిలీ మద్యం దందాపై వార్తలు రాస్తున్నారనే కక్ష సాధింపుతో సాక్షి, జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. టీపీటీఎఫ్, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు అనిల్‌కుమార్, వెంకటి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం సాక్షి గొంతుకను నొక్కే కు ట్ర చేస్తున్నారని, పత్రికా స్వేచ్ఛను హరించాలని చూస్తే ప్రజా ఆగ్రహానికి గురవుతారన్నారు. తక్షణ మే దాడులు నిలిపివేసి, తప్పుడు కేసులను కొట్టివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్ మాట్లాడుతూ ప్రజల పక్షాన వార్తలు రాస్తున్న సాక్షిపై, జర్నలిస్టులపై వరుసగా దాడులు చేయడం సిగ్గుచేటన్నా రు. సీపీఎం, సీపీఐల జిల్లా కార్యదర్శులు చంద్రశేఖర్, దశరత్ మాట్లాడు తూ సాక్షిపై దాడు లు చేయడం రా జ్యాంగాన్ని అవమానపరచడమే అన్నారు. కార్యక్రమంలో జర్నలిస్టులు, ప్రజాసంఘాల నాయకులు నర్సింలు, బాలరాజు, విఠల్, ఆబిద్, ముదాం శంకర్,వినయ్, అన్వర్, శ్రీకాంత్, ప్రభు, ఆశన్న, సత్యం పాల్గొన్నారు.
● సాక్షి దినపత్రికకు మద్దతుగా బాన్సువాడలోని అంబేడ్కర్ చౌరస్తాలో పాత్రికేయులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీలో కూటమి సర్కా రు సహకారంతో కొనసాగుతున్న నకిలీ మద్యం దందాపై సాక్షిలో వస్తున్న వరుస కథనాలను నిరోధించడానికి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిని నోటీసుల పేరుతో పోలీసులు వేధిస్తున్నారని అన్నా రు. కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు సుధాకర్‌గౌడ్, గంట చంద్రశేఖర్, సీపీఎం నాయకు డు ఖలీల్, బీఆర్‌ఎస్ నాయకులు సాయిబాబా, బోడ చందర్, ఇసాక్, మహేశ్, జర్నలిస్టులు గిరిధర్, అంబిల్‌పూర్ రాజు, పోశీరాం, జాడె గోపాల్, హన్మాండ్లు, సతీశ్, శ్రీనివాస్, మధుసూదన్, ప్ర మోద్‌రెడ్డి,బర్ల సుధాకర్, అహ్మద్, సుధీర్, అశ్వాఖ్, సుందర్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
● సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డిపై ఏపీ ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేయడంపై వర్కింగ్ జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం నిజాంసాగర్ తహసీల్దార్ భిక్షపతికి జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు. నకిలీ మద్యం తయారీపై వార్తలు ప్రచురించడంతో ఏపీ ప్రభు త్వం అక్రమ కేసులు నమోదు చేస్తూ పత్రికాస్వేచ్ఛను కాలరాస్తోందని మండిపడ్డారు. కార్యక్రమంలో జర్నలిస్టులు బాలరాజు, రెడ్డిశెట్టి భాస్కర్, జూనే ద్, రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘సాక్షి’ పై కక్ష సాధింపు
మానుకోవాలని డిమాండ్
కామారెడ్డి, బాన్సువాడ, నిజాంసాగర్‌లో జర్నలిస్టు, ప్రజా సంఘాల ఆందోళనలు
జిల్లా కేంద్రంలో కొవ్వొత్తుల ప్రదర్శన
కూటమి కుట్రలపై వెల్లువెత్తిన నిరసన


