అనుమతులు తీసుకోవాలి
● బాణా సంచా కాలుస్తున్నప్పుడు
జాగ్రత్తలు తప్పనిసరి
● అప్రమత్తంగా ఉండాలని
అధికారుల సూచనలు
బాన్సువాడ : చిన్నా పెద్ద తేడా లేకుండా ఆనందోత్సాహాలతో గడిపే దీపావళి పండుగను ఈ నెల 20న లక్ష్మి పూజలు, 21న పాఢ్యమిని జరుపుకోనున్నారు. ఆ రోజు బాణసంచా కాలుస్తూ ఆనంద డో లికల్లో ఓలలాడుతారు. అయితే ఆ వెలుగుల మా టున ప్రమాదం పొంచి ఉంటుంది. టపాసులు కా ల్చే సమయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. జిల్లా వ్యాప్తంగా టపాసుల వ్యాపారం మొదలైంది. పోలీసు, రెవెన్యూ, ఫైర్, ట్రాన్స్‌కో శాఖల అధికారులు నిత్యం టపాసుల విక్రయ కేంద్రాలను పర్యవేక్షిస్తుండాలి.
ఇవి పాటించాలి..
● గ్రామీణ ప్రాంతాల్లో గడ్డి వాములు, పూరి గుడిసెలు ఉంటాయి. అక్కడ రాకెట్లు, చిచ్చుబుడ్లు, తా రాజువ్వలు వంటివి కాల్చరాదు. టపాకాయల పనితీరు, వెలిగించాల్సిన విధానం తదితర అంశాలపై పిల్లలకు అర్థమయ్యేలా వివరించాలి.
● పెద్దల పర్యవేక్షణలో పిల్లలతో టపాసులు కా ల్పించాలి. రోడ్లపై పేల్చితే వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది.
● వ్యాపారులు జన సంచారం లేని, ఊరికి దూరంగా ఉండే ప్రాంతాల్లో దుకాణాలు ఏర్పాటు చేయాలి.
● టపాసులు విక్రయించే వ్యాపారులు రెవిన్యూ, పోలీసు, అగ్నిమాపక, మున్సిపల్/పంచాయితీ, విద్యుత్ శాఖ తదితర శాఖల అధికారుల నుంచి అనుమతులు పొందాలి.
● విక్రయ ప్రాంతంలో విధిగా ఇసుక, నీరు, కార్బన్ డయాకై ్సడ్ వాయువును అందుబాటులో ఉంచుకోవాలి.
● దుకాణాల సమీపంలో ఎవరూ సిగరెట్లు, బీడీలు కాల్చకూడదని బోర్డులు ఏర్పాటు చేయాలి.
● సెల్‌ఫోన్‌లో మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలి. దుకాణాల మధ్య కనీసం 10 అడుగుల దూరం ఉండాలి.
● మందుగుండు సామగ్రి విక్రయించే కేంద్రాల్లో విద్యుత్ వైరింగ్ సక్రమంగా ఉండేలా చూడాలి.
● ప్రతీ దుకాణం ఎదుట అగ్ని మాపక కేంద్రాల ఫోన్ నంబర్లు ఉండాలి.
టపాకాయలు విక్రయించే వ్యాపారులు తప్పనిసరిగా అనుమతులు పొందాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడైనా అనుమతులు లేకుండా టపాకాయలు విక్రయిస్తే చర్యలు తప్పవు. – తుల శ్రీధర్, సీఐ, బాన్సువాడ


