ఎమ్మెల్యేకు ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేకు ఆహ్వానం

Oct 18 2025 6:45 AM | Updated on Oct 18 2025 6:45 AM

ఎమ్మె

ఎమ్మెల్యేకు ఆహ్వానం

ఎమ్మెల్యేకు ఆహ్వానం చదువులతోపాటు క్రీడలూ అవసరమే బీజేపీ మండల కార్యవర్గం ఎన్నిక

ఎల్లారెడ్డిరూరల్‌: ఎల్లారెడ్డి పట్టణంలో ఈనెల 24 నుంచి నిర్వహించనున్న రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి రావాలని కోరుతూ ఎల్లారెడ్డి సొసైటీ వైస్‌ చైర్మెన్‌ ప్రశాంత్‌గౌడ్‌ గౌడ సంఘం సభ్యులతో కలిసి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావుకు శుక్రవారం ఆహ్వాన పత్రికను అందించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు. గౌడ సంఘం నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌, ఈశ్వర్‌గౌడ్‌, నారాగౌడ్‌ తదితరులున్నారు.

పిట్లం(జుక్కల్‌): విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలూ అవసరమేనని, క్రీడలు విద్యార్థులలో మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో పిట్లం మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభించారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు.అనంతరం ఆయా పా ఠశాలలకు చెందిన విద్యార్థులు మార్చ్‌ ఫాస్ట్‌ ని ర్వహించారు. మార్చ్‌ ఫాస్ట్‌లో పిట్లం బ్లూబె ల్స్‌ పాఠశాల విద్యార్థులు మొదటి బహుమతి ని గెలుచుకున్నారు. ఎంఈవో దేవిసింగ్‌, ఆ యా ఉపాధ్యాయ సంఘాల సభ్యులు, ఉపాధ్యా యులు,నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కామారెడ్డి రూరల్‌: మండల బీజేపీ కార్యవర్గాన్ని పార్టీ మండల అధ్యక్షుడు చందన శ్రీధర్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్నుకున్నారు. ఇస్రోజీవాడి గ్రామానికి చెందిన చెన్నాల అనిల్‌రెడ్డి, భాస్కర్‌, లక్ష్మారెడ్డి, బాలక్రిష్ణ, రాజలింగం, స్వామిలను ఉపాధ్యక్షులుగా, మండల యువ మోర్చా అధ్యక్షుడిగా చెట్కూరి మహిపాల్‌, దళి త మోర్చా అధ్యక్షుడిగా దేవునిపల్లి పోచయ్యలను ఎన్నుకున్నారు. అలాగే ప్రధాన కార్యదర్శులుగా రవి, అమృతరావు, కార్యదర్శులుగా శ్రీనివాస్‌గౌడ్‌, రమేష్‌గౌడ్‌, సాయిరెడ్డి, భాస్క ర్‌, నరేశ్‌, కోశాధికారిగా వీరేశంలను నియమించారు. అనంతరం వారిని సన్మానించారు.

ఆర్టీసీ లక్కీడ్రా విజేతలకు చెక్కుల ప్రదానం

నిజామాబాద్‌ సిటీ: దసరా సీజన్‌ నేపథ్యంలో ఆర్టీసీ ‘లక్కీడ్రా’ కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నిజామాబాద్‌ నుంచి సికింద్రాబాద్‌ వరకు లగ్జరీ, సూపర్‌ లగ్జరీ, రాజధాని బస్సుల్లో ప్రయాణించిన వారికి డ్రాలో పాల్గొనే అవకాశం కల్పించింది. జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లోగల ఆర్‌ఎం కార్యాలయంలో ఇటీవల డ్రా తీయగా, విజేతలకు ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డి శుక్రవారం చెక్కులు అందించారు. మొదటి బహమతి చంద్రయ్యకు రూ.25 వేలు, రెండో బహుమతి షేక్‌ బాబర్‌కు రూ.15 వేలు, మూడో బహుమతి రాంప్రసాద్‌కు రూ.10వేలు అందించారు. కార్యక్రమంలో ఆర్‌ఎం జ్యోత్స్న, డిప్యూటీ రీజినల్‌ మేనేజర్‌ మధుసూదన్‌, పరమాత్మ, ఆనంద్‌ బాబు, డీఎం–1 ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

చెట్కూరి మహిపాల్‌ ,దేవునిపల్లి పోచయ్య

ఎమ్మెల్యేకు ఆహ్వానం 1
1/2

ఎమ్మెల్యేకు ఆహ్వానం

ఎమ్మెల్యేకు ఆహ్వానం 2
2/2

ఎమ్మెల్యేకు ఆహ్వానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement