బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించాలి
కామారెడ్డి టౌన్: బీసీలకు 42శాతం అమలు చేయాలని తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాలని కామారెడ్డి బీసీ కులాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో వారు మాట్లాడారు. రాష్ట్ర బంద్‌తో బీసీల తడాఖా చూపిస్తామన్నారు. ఈ బంద్‌లో వ్యాపార, వాణిజ్య, వర్తక సంఘాలు, విద్యా సంస్థలు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం కలెక్టరేట్‌కు తరలివెళ్లి టీఎన్జీవోస్, టీజీవో సంఘాల నాయకులకు వినతిపత్రాలను అందజేశారు. బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరారు. బీసీ కులాల జేఏసీ నాయకులు నాగరాజు, కుంబాల లక్ష్మణ్, శివరాములు, పండ్ల రాజు, కుంబాల రవి, నాగరాజ్ గౌడ్, భూమన్న, కొత్తపల్లి మల్లన్న, గైని శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. అలాగే బంద్‌కు బీఆర్‌ఎస్, బీఎస్‌పీ, బీసీ టీయూ, ఎమ్మార్పీఎస్ మద్దతు తెలిపాయి.


