కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలి
కామారెడ్డి టౌన్: సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో బీఆర్‌ఎస్ పార్టీ అసత్యపు ప్రచారానికి బాధ్యులుగా చేస్తూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్‌రావు శుక్రవారం జిల్లా అదనపు ఎస్పీ నర్సింహారెడ్డికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేక సామాజిక మాధ్యమాల్లో విద్వేషాన్ని, రెచ్చగొట్టే విధంగా అసత్యపు పోస్టులు పెడుతున్నారని విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, నాయకులు గుడుగుల శ్రీనివాస్, గోనె శ్రీనివాస్, చాట్ల రాజేశ్వర్, రవీందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్: డీసీ సీ అధ్యక్షుడి ఎన్నిక పారదర్శకంగా ఎన్నుకోవాలని ఏఐసీసీ జిల్లా పరిశీలకుడు రా జ్‌పాల్ కరోలాను టీ పీపీసీ రాష్ట్ర కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి కోరారు. శుక్రవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. కామారెడ్డి నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడి ఎన్ని క ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పారు. పాత అధ్యక్షుడికి ఏవైనా పదవులు వచ్చేంత వరకు.. జిల్లా అధ్యక్షుడిగా ఉంటారని ప్రకటించడం ఏకపక్ష నిర్ణయం సరికాదన్నారు. పార్టీ బలోపేతం దిశగా ఎన్నిక జరగాలని కోరారు.
కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలి


