గోవుల అక్రమరవాణా అడ్డగింత
భిక్కనూరు: మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు లారీలో అక్రమంగా తరలిస్తున్న గోమాతలను శుక్రవారం మండలంలోని బస్వాపూర్ గ్రామం జాతీయ రహదారిపై గోసంరక్షణ సమితి ప్రతినిధులు పట్టుకున్నారు. గోవుల తరలింపును గమనించి వారు హైవేపై లారీని వెంబడించారు. లారీని నిలిపి అందులో చూడగా 53 ఆవులు ఉన్నట్లు గుర్తించి, పోలీసులుకు సమాచారం అందించారు. ఎస్సై అంజనేయులు కేసు నమోదు చేసుకొని, మద్దికుంట బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్న గోశాలకు ఆవులను తరలించారు.
డ్రంకన్‌డ్రైవ్ కేసులో నలుగురికి జైలు
ఎల్లారెడ్డి: మండలంలో పోలీసులు డ్రంకన్‌డ్రైవ్ తనిఖీలు చేపట్టగా, నలుగురు వ్యక్తులు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వా రిని శుక్రవారం ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టులో పోలీసులు హాజరుపర్చారు. జడ్జి వారికి ఒకరోజు జైలు శిక్షతోపాటు పదకొండు వందల రూపాయల జరిమానా విధించినట్లు ఎస్సై మహేశ్ శుక్రవారం తెలిపారు.


