ఉపాధ్యాయుడు ప్రవీణ్‌కు అభినందన
కామారెడ్డి రూరల్: చిన్నమల్లారెడ్డి బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు ప్రవీణ్‌కుమార్‌ను గురువారం రాత్రి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అభినందించారు. 2025– 26 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కృత్యాధార బోధనకు విశేష ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఎస్‌సీఈఆర్‌టీ తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రతిభావంతమైన 15 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారి ద్వారా ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ప్రయోగ దీపికలను రూపొందించారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా నుంచి ప్రవీణ్ కుమార్‌ను ఎంపిక చేశారు. ప్రవీణ్ ప్రతిభ, కృషిని గుర్తించిన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా సైన్స్ అధికారి సిద్దరాంరెడ్డి ఉన్నారు.


