క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Oct 17 2025 6:28 AM | Updated on Oct 17 2025 6:28 AM

క్రైం

క్రైం కార్నర్‌

సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లో రుద్రూర్‌వాసి మృతి

రుద్రూర్‌: మండల కేంద్రానికి చెందిన కర్రోళ్ల శ్రీనివాస్‌ (53) అనే వ్యక్తి గురువారం కుమురం భీం జిల్లా సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో ప్రమాదవశాత్తు రైలు కింద పడి దుర్మరణం చెందినట్టు స్థానికులు తెలిపారు. కూలి పని నిమిత్తం పది రోజుల క్రితం వెళ్లిన శ్రీనివాస్‌ మృతి చెందాడన్న సమాచారం తెలుసుకున్న బంధువులు సిర్పూర్‌ కాగజ్‌నగర్‌కు బయల్దేరి వెళ్లారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

గాంధారి శివారులో మృతదేహం

గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్ర శివారులోని గాంధారి–చద్మల్‌ రహదారి పక్కన గుంతలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం గురువారం లభించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. రైతుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించి మృతదేహాన్ని పరిశీలించారు. దుండగులు గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి పెట్రోలు పోసి దహనం చేసినట్లు తెలుస్తోంది. మృతదేహం పాక్షికంగా దహనం అయింది. సదాశివనగర్‌ సీఐ సంతోష్‌ కుమా ర్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి విచారణ చేశారు. మృతదేహాన్ని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 30–35 ఏళ్ల మధ్య ఉంటుందని, నీలిరంగు జీన్‌ ప్యాంటు, తెల్లని బనియన్‌, నల్లచారలు కల్గిన తెల్లచొక్కా ధరించి ఉన్నాడు. సంబంధీకులు ఎవరైనా 8712686165, 8712686163 నెంబర్లకు ఫోన్‌ చేసి సంప్రదించాలని తెలిపారు.

చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్‌

మాచారెడ్డి: చోరీ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై అనిల్‌ గురువారం తెలిపారు. జూన్‌ 2న మండలంలోని కొత్తపల్లె గ్రామానికి చెందిన ఆమ లక్ష్మీనారాయణ ఇంట్లో నుంచి గుర్తు తెలియని దుండగులు బంగారు, వెండి ఆభరణాలను అపహరించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా చోరీకి పాల్పడిన వ్యక్తులను అదే గ్రామానికి చెందిన రాయన పట్ల రాజు, గజ్యానాయక్‌ తండా చౌరస్తాకు చెందిన మేకల మాధవ్‌గా గురువారం గుర్తించారు. నిందితుల నుంచి ఐదు మాసాల బంగారు ఉంగరం, మూడు మాసాల వెండి గొలుసులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వివరించారు.

మహిళ అదృశ్యం

లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రానికి చెందిన బైండ్ల గంగామణి అదృశ్యమైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. లింగంపేటకు చెందిన బైండ్ల సాయిలుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య గంగామణి, రెండో భార్య భూమవ్వ ఈ నెల 13న గొడవపడ్డారు. దీంతో పెద్ద భార్య గంగామణి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. చుట్టుపక్కల, స్నేహితులు, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. లింగంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

క్రైం కార్నర్‌1
1/2

క్రైం కార్నర్‌

క్రైం కార్నర్‌2
2/2

క్రైం కార్నర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement