డీపీఆర్‌వోగా తిరుమల
కామారెడ్డి టౌన్: కామారెడ్డి జిల్లా నూతన డీపీఆర్‌వోగా ఆదిలాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న బి.తిరుమల బదిలీపై వచ్చారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల బోకేను అందజేసి, ఉత్తర్వులను అందుకున్నారు. ఇన్‌చార్జి డీపీఆర్‌వో రవికుమార్ నుంచి బాధ్యతలను స్వీకరించారు.
ఎల్లారెడ్డి: ఎంఆర్‌పిఎస్, ఎంఎస్పీ, వీహెచ్‌ఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఎల్లారెడ్డి పట్టణంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సంఘం నాయకులు కంతి పద్మారావు, రామగళ్ల శివానందం తెలిపారు. భారత ప్రధాన న్యాయమూర్తి రామకృష్ణ గవాయ్‌పై దాడిని నిరసిస్తూ ఆందోళన చేపట్టనున్నట్లు వారు తెలిపారు. ఆయనపై దాడి చేసిన ద్రోహులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఎమ్మార్వో కార్యాలయానికి ఎమ్మార్పీఎస్ దాని అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తప్పక హాజరుకావాలని వారు కోరారు.
సాక్షి నెట్‌వర్క్:బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లు అమలు చేయాలని కోరుతూ ఈ నెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాలని బీఎల్‌పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిద్దిరాములుతో పాటు బీసీ కులాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు కామారెడ్డి జిల్లా కేంద్రంలో వేర్వేరుగా పిలుపునిచ్చారు. అలాగే బీసీ బంద్‌కు సహకరించాలని బీసీ సంఘం నాయకులు పిట్లంలో తహసీల్దార్ రాజ నరేందర్ గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు. బంద్‌కు తెలంగాణ అంబేడ్కర్ యువజన సంఘం నేతలు, తెలంగాణ యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు అర్కల ప్రభాకర్ యాదవ్‌లు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ..బీసీలకు 42శాతం రిజర్వేషన్ వచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు.
కామారెడ్డి టౌన్: తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా రాజనర్సును ఎన్నుకున్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజల్‌లో ఇటీవల నిర్వహించిన యూనియన్ ఐదో రాష్ట్ర మహాసభల్లో జిల్లాకు చెందిన నాయకులను రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నారు. గుర్రం దీవెన, మహబూబ్, వీరయ్య, నర్సవ్వను రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. రాష్ట్ర కమిటీలో చోటు సాధించిన వారిని జిల్లా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు అభినందించారు.
డీపీఆర్‌వోగా తిరుమల


