షీటీంలపై అవగాహన పెంచుకోవాలి
మాచారెడ్డి: విద్యార్థినులు షీటీంపై అవగాహన పెంచుకోవాలని మాచారెడ్డి ఏఎస్సై ప్రభాకర్ రెడ్డి సూచించారు. గురువారం పాల్వంచ మండలం ఆరేపల్లి వద్ద ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. సైబర్ మోసాలకు గురైన వాళ్లు 1930 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు. బాలికలు, మహిళలు ఏ దైనా మోసాలకు గురైనప్పుడు 87116 86094 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించా రు. సిబ్బంది రాజేందర్, సౌజన్య, భూమయ్య, తిరుపతి, శేషారావు, తదితరులు ఉన్నారు.
● ఒక్కటైన ప్రేమజంట
నిజాంసాగర్(జుక్కల్): మహ్మద్‌నగర్ మండలం తెల్గాపూర్ గ్రామానికి చెందిన దనుల రవీందర్, నేపాల్‌కు చెందిన మాయ ఒక్కటయ్యారు. గురువారం తెల్గాపూర్ గ్రామంలో వేద పండితుడు, గ్రామస్థుల సమక్షంలో ఇద్దరి పెళ్లి సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. తెల్గాపూర్ గ్రామానికి చెందిన దనుల వెంకవ్వ, ఎల్లయ్య దంపతులు రెండో కుమారుడు రవీందర్ ఏడు సంవత్సరాల నుంచి దుబాయ్‌లో ఉంటూ ఉపాధి పొందుతున్నాడు. రవీందర్ పని చేస్తున్న కంపెనీలోనే నేపాల్‌కు చెందిన మాయ పనిచేస్తోంది. మూడు సంవత్సరాల నుంచి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. పది రోజుల కిందట రవీందర్‌తోపాటు మాయ దుబాయ్ నుంచి తెల్గాపూర్ గ్రామానికి వచ్చారు. రవీందర్ తన తల్లిదండ్రులను ఒప్పించి మాయను వివాహం చేసుకున్నారు.
భిక్కనూరు: అంతంపల్లి గ్రామ విండో మహాజన సభను ఈ నెల 17న నిర్వహిస్తున్నట్లు విండో అధ్యక్షుడు వలకొండ వెంకట్‌రెడ్డి గురువారం తెలిపారు. విండో పరిధిలోని అంతంపల్లి, లక్ష్మీదేవునిపల్లి గ్రామాలకు చెందిన రైతులు తప్పనిసరిగా సభకు హాజరు కావల్సిందిగా ఆయన కోరారు.
షీటీంలపై అవగాహన పెంచుకోవాలి


