ఖోఖోకు క్రీడాకారులు ఎంపిక
నిజాంసాగర్(జుక్కల్):అండర్–14, అండర్–17 వి భాగం జిల్లా స్థాయి పోటీలకు బుధవారం మండలంలోని మల్లూర్ ఉన్నత పాఠశాల ఆవరణలో క్రీ డాకారులను ఎంపిక చేసినట్లు ఎంఈవో తిరుపతి రె డ్డి తెలిపారు. నిజాంసాగర్, పిట్లం, పెద్దకొడప్‌గల్ మండలాల పరిధిలోని పిట్లం జోన్ తరపున జిల్లా స్థాయి ఖోఖో పోటీలకు క్రీడాకారులను ఎంపిక చే శామన్నారు.పీడీలు రాజు,జావిద్,సంజీవ్,సంతోష్, సాయిలు,ప్రియాంక,అన్నపూర్ణ ఉన్నారు.
రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు గురుకుల విద్యార్థుల ఎంపిక
నస్రుల్లాబాద్: రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ మాధవరావు తెలిపారు. బుధవారం పాఠశాలలో వారిని అభినందించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తరఫున ఈనెల 16 నుండి 18 వరకు సంగారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో వీరు పాల్గొంటారని ప్రిన్సిపాల్ తెలిపారు. వైస్ ప్రిన్సిపల్ రాహుల్, పీఈటీ ప్రవీణ్ పాల్గొన్నారు.
లింగంపేట నుంచి నలుగురు విద్యార్థులు..
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని జ్యోతిబాపూ లే గురుకుల పాఠశాలకు చెందిన నలుగురు విద్యా ర్థులు రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ మంజుల తెలిపారు. ఎస్‌జీఎఫ్‌లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన క్రీడల్లో అండర్–14, అండర్–17 విభాగంలో ప్రతిభ కనపర్చిన నలుగు రు విద్యార్థులు ఆత్మారాం, అరివింద్, శ్రీప్రణీత్, కా ర్తీక్ వాలీబాల్ క్రీడలకు ఎంపికై నట్లు తెలిపారు. ఆ విద్యార్థులను పాఠశాల సిబ్బంది అభినందించారు.
తాడ్వాయి నుంచి ఇద్దరు క్రీడాకారులు..
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని బ్రాహ్మణపల్లిలో గల ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు కబడ్డీ, వాలీబాల్‌లో అండర్–14 విభాగంలో రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు పాఠశాల హెచ్‌ఎం చంద్రవతి, పీడీ నగేష్ తెలిపారు. కబడ్డీ విభాగంలో ఏ. సమన్విత, వాలీబాల్ విభాగంలో వి.నందిని ఇటీవల కామారెడ్డిలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలలో పాల్గొని తమ ప్రతిభను కనబర్చారన్నారు. క్రీడాకారులను పాఠశాలలో బుధవారం అభినందించారు.
క్రైం కార్నర్
ఖోఖోకు క్రీడాకారులు ఎంపిక
ఖోఖోకు క్రీడాకారులు ఎంపిక


