నేడు ఆర్ట్స్ కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్, ఈకో బజార్
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో గురువారం ఫుడ్ ఫెస్టివల్, క్యాంపస్ ఈకో బజార్ కార్యక్రమం నిర్వహించనున్నట్టు ప్రిన్సిపల్ విజయ్‌కుమార్ తెలిపారు. విద్యార్థులకు వస్తువుల అమ్మకం, మార్కెటింగ్ ప్రణాళిక, నాయకత్వ లక్షణాలు, నైపుణ్యాలు, స్టాళ్ల ఏర్పాటు, సుందరీకరణ, పర్యావరణ స్నేహ పూర్వక ఉత్పత్తులు, సేవలను తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ప్రిన్సిపల్ వివరించారు.
కామారెడ్డి అర్బన్: అపోలో ఫార్మసీలో ఉద్యోగాల కోసం ఈనెల 17న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్‌లోని 121 నంబర్ గదిలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎం.రజనీ కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. డి–ఫార్మా, బి–ఫార్మా(పీసీఐ) అర్హతతో సీ్త్ర, పురుష ఫార్మసిస్టులకు 40 ఖాళీలు(రూ.17,644 వేతనం), డి–ఫార్మా, బి–ఫార్మా అర్హతతో పురుషులకు ట్రైయినీ ఫార్మసిస్టులకు 20 (రూ.16,144 వేతనం), పదవ తరగతి అర్హతతో ఫార్మసీ అసిస్టెంట్ పురుషులకు 30(రూ.15,879 వేతనం), రిటైల్ ట్రైయినీ 10 ఖాళీలు పురుషులకు (రూ.12వేల వేతనం) ఉన్నాయని పేర్కొన్నారు. వివరాలకు 72079 17714, 76719 74009 నంబర్లకు సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
పిట్లం(జుక్కల్): మండల కేంద్రానికి చెందిన వ్యాపారి పడిగేల సుభాష్ సేట్ సతీమణి వారం క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. అదే విధంగా గురుస్వామి ఈశ్వర్ దయాళ్‌రెడ్డి మాతృమూర్తి గత వారం రోజుల క్రితం మృతి చెందారు. విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే బుధవారం వారి ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.


