బోనస్‌ ప్రశ్నార్థకం..! | - | Sakshi
Sakshi News home page

బోనస్‌ ప్రశ్నార్థకం..!

Oct 16 2025 5:57 AM | Updated on Oct 16 2025 5:57 AM

బోనస్

బోనస్‌ ప్రశ్నార్థకం..!

బోనస్‌ ప్రశ్నార్థకం..! ఆశతోనే సాగు చేశాం.. ప్రభుత్వానికి నివేదించాం..

ఖరీఫ్‌లో 1.40 లక్షల ఎకరాల్లో..

యాసంగి సన్నాలకు అందని వైనం

జిల్లాకు రావాల్సింది రూ.89 కోట్లు

ఇస్తారనే ఆశతో ఖరీఫ్‌లో మళ్లీ సన్నరకం వరి సాగు

స్పష్టత లేక రైతుల్లో ఆందోళన

కామారెడ్డి క్రైం: సన్నరకం వడ్ల సాగును ప్రోత్సహిస్తామంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రా గానే క్వింటాలుకు రూ.500 బోనస్‌ ప్రకటించింది. అందులో భాగంగా ఖరీఫ్‌లో నిధులు మంజూరు చే సిన ప్రభుత్వం, యాసంగి నుంచి బోనస్‌ ఊసె త్తడం లేదు. యాసంగిలో రైతులు విక్రయించిన స న్నాలకు సంబంధించిన బోనస్‌ డబ్బులు ఇప్పటికీ పడలేదు. అయితే, ఖరీఫ్‌లోనైనా ఇవ్వకపోతారా అనే ఆశతో మళ్లీ సన్నాలు సాగు చేశారు. ప్రస్తుతం పంట కోతలు జరుగుతున్నాయి. ఇప్పటికీ ప్రభు త్వం నుంచి అధికారిక ఉత్తర్వులు, ప్రకటన రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

పెండింగ్‌లో రూ.89 కోట్లు..

గత యాసంగిలో జిల్లా వ్యాప్తంగా రైతులు మొత్తం 2,61,110 ఎకరాల్లో వరి సాగుచేశారు. దాంట్లో దాదాపు 60 వేలకు పైగా ఎకరాల్లో సన్నరకం వడ్లను పండించారు. మార్చి నెలాఖరు నుంచి కొనుగోళ్లు ప్రారంభించి మొత్తం 3.82 లక్షల మెట్రిక్‌ ట న్నుల ధాన్యాన్ని సేకరించారు. అందులో 1,78,416 మెట్రిక్‌ టన్నులు సన్నరకం ధాన్యం సేకరణ చేపట్టగా, అందుకు సంబంధించిన రూ.886 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. బోనస్‌ డబ్బుల కోసం సన్నాలు పండించిన 72,852 మంది రైతులు మాత్రం ఎదురుచూస్తూనే ఉన్నారు.

బోనస్‌ వస్తుందనే ఆశతోనే యాసంగిలో సన్నరకం వడ్లు పండించాను. 6 నెలలు దాటినా ఇంకా బోనస్‌ డబ్బులు పడలేదు. సాగు ఖర్చులు బాగా పెరిగాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం స్పందించాలి.

– అల్లం రాములు, మైలారం,

నస్రుల్లాబాద్‌ మండలం

యాసంగి బోనస్‌ డబ్బులకు సంబంధించిన అన్ని వివరాలను ప్రభుత్వానికి నివేదించాం. జిల్లాకు రూ.89 కోట్ల వరకు రావాల్సి ఉంది. నేరుగా రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమ అవుతాయి. బోనస్‌ అనేది నిరంతర ప్రక్రియనే. ఎప్పుడు వస్తాయనే దానిని ప్రభుత్వమే నిర్ణయిస్తుంది.

– శ్రీకాంత్‌, డీఎం, సివిల్‌ సప్లయ్‌

కార్పొరేషన్‌, కామారెడ్డి

యాసంగిలో కంటే ఖరీఫ్‌లో వరి సాగు ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 3.18 లక్షల ఎకరాల్లో వరి పండించారు. అందులో 1.40 లక్షల ఎకరాల్లో సన్నరకం వడ్ల సాగు జరిగి ఉండొచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. బాన్సువాడ, నస్రుల్లాబాద్‌, బీర్కూర్‌, నిజాంసాగర్‌, నాగిరెడ్డిపేట తదితర మండలాల పరిధిలో వరి కోతలు మొదలుకాగా, కేంద్రాలకు ధాన్యం తరలివస్తోంది.

బోనస్‌ ప్రశ్నార్థకం..!1
1/2

బోనస్‌ ప్రశ్నార్థకం..!

బోనస్‌ ప్రశ్నార్థకం..!2
2/2

బోనస్‌ ప్రశ్నార్థకం..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement