నిరంతరాయంగా విద్యుత్ సరఫరా
● ఎస్‌ఈ శ్రావణ్‌కుమార్
నిజాంసాగర్(జుక్కల్): వ్యవసాయరంగంతో పాటు గృహ అవసరాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఎస్‌ఈ శ్రావణ్‌కుమార్ పేర్కొన్నారు. మండలంలోని మల్లూ ర్ 33 కేవీ సబ్‌స్టేషన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన బ్రేకర్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ కరెంట్ సమస్య తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఇటీవల కురిసిన వర్షాలు, వరద నీటి ప్రవాహాల కారణంగా ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలయన్నారు. వాటి స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేసి కరెంట్ సరఫరాకు ఆటంకం లేకుండా చూశామని తెలిపారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో ఏడీ అరవింద్, ఏఈ మోహన్ నాయక్, లైన్‌మన్లు శ్రీనివాస్, శేర్ అలీ, నాగరాజు తదితరులు ఉన్నారు.
● ప్రారంభించిన అదనపు కలెక్టర్ విక్టర్
కామారెడ్డి క్రైం: వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కలెక్టరేట్‌లోని సివిల్ సప్లయ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంను అదనపు కలెక్టర్ విక్టర్ బుధవారం ప్రారంభించారు. ఽఅనంతరం కంట్రోల్ రూంను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన ఏవైనా సమస్యలు, ఫిర్యాదులు ఉంటే టోల్‌ఫ్రీ నెంబర్ 08468–220051కు సంప్రదించాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డీఎం శ్రీకాంత్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
బాన్సువాడ రూరల్: మండలంలోని బోర్లం క్యాంపు శివారులోని నిజాంసాగర్ ప్రధాన కా లువకు అనుబంధంగా ఉన్న 11 నెంబర్ డి స్ట్రిబ్యూటరీ కెనాల్‌ను బుధవారం నీటి పారు దల శాఖ ఎస్‌ఈ దక్షిణమూర్తి పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు డి స్ట్రిబ్యూటరీ కెనాల్ వద్ద కట్ట కుంగిపోయి మట్టికొట్టుకుని పోయింది. దీంతో ప్రధాన కాలువ ప్రమాదకరంగా మారింది. మరమ్మతులకు రూ.10 లక్షల నిధులు మంజూరైనా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. దీంతో ఎస్‌ఈ దక్షిణమూర్తి, డీఈఈ శ్రీచంద్, ఏఈ నితిన్ వాస్తవ పరిస్థితిని గమనించారు. కాంట్రాక్టర్లతో మాట్లాడి వీలైనంత త్వరగా పనులు పూర్తిచేయిస్తామన్నారు. వారి వెంట గ్రామస్తులు శ్రీనివాస్‌రెడ్డి, మమ్మాయి కాశీరాం, సత్యం, కృష్ణ, బస్వయ్య, మంద శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
● ఎస్పీ రాజేశ్‌చంద్ర
కామారెడ్డి రూరల్: ప్రతి పోలీసు ప్రజల శాంతిభద్రతల పరిరక్షణలో నిబద్ధతతో వ్యవహరించాలని జిల్లా ఎస్పీ రాజేశ్‌చంద్ర పేర్కొన్నారు. పోలీస్ ఉద్యోగం బాధ్యత, సేవతో కూడుకున్నదని తెలిపారు. కామారెడ్డి రూ రల్ పోలీస్ స్టేషన్‌ను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సర్కిల్ కా ర్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన రికా ర్డు రూంను ప్రారంభించారు. స్టేషన్ శుభ్రత, రికార్డుల నిర్వహణ, దర్యాప్తులో ఉన్న గ్రేవ్ కే సుల ప్రగతిని సమీక్షించారు. ఎలాంటి కేసు లు పెండింగ్‌లో ఉండకుండా చర్యలు తీసు కోవాలన్నారు. కేడీ, సస్పెక్ట్, రౌడీ షీటర్లు కదలికలను క్రమం తప్పకుండా పరిశీలించి, నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. రో డ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాల్లో ర్యాంబుల్ స్ట్రిప్స్, ఇసుక డ్రమ్ము లు, సూచిక బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పా టు చేయాలన్నారు. ఎస్పీ వెంట రూరల్ సీఐ రామన్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
నిరంతరాయంగా విద్యుత్ సరఫరా
నిరంతరాయంగా విద్యుత్ సరఫరా
నిరంతరాయంగా విద్యుత్ సరఫరా


