ఏకాభిప్రాయంతోనే డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక
● ఏఐసీసీ జిల్లా అబ్జర్వర్ రాజ్‌పాల్ కరోల
ఎల్లారెడ్డి: జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల ఏకాభిప్రాయం మేరకు డీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేస్తామని ఏఐసీసీ జిల్లా పరిశీలకుడు, రాజ్యసభ ఎంపీ రాజ్‌పాల్ కరోల స్పష్టం చేశారు. బుధవారం ఎల్లారెడ్డిలో నిర్వహించిన సంఘటన సృజనా అభియాన్, నియోజవకర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా రాజ్‌పాల్ కరోలా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామిక విలువలకు పెద్దపీట వేస్తామని, అందరి ఏకాభిప్రాయ నిర్ణయంతోనే కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందన్నారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల ప్రార్టీ శ్రేణుల అభిప్రాయ సేకరణ పూర్తయ్యాక టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, సీఎం రేవంత్‌రెడ్డి, జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు తమ నివేదిక అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్‌రావు, మార్కెట్ కమిటీ చైర్మన్లు రజిత వెంకట్రామ్‌రెడ్డి, బండారి పరమేశ్, మాజీ మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా చేపట్టిన ఓట్ చోర్..గద్దీ చోర్ ఆందోళనకు మద్దతుగా రాజ్‌పాల్ కరోల, మదన్‌మోహన్ రావు, డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్‌రావు తదితరులు సంతకాలు చేశారు.


