5.98 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రావొచ్చు
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: ఖరీఫ్ సీజన్‌లో 5.98 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, సీఎస్ రామకృష్ణారావుతో కలిసి కలెక్టర్లు, అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై బుధవారం వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీసీ అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. భారీ వర్షాలు కురిస్తే వరద నీరు రాకుండా కొనుగోలు కేంద్రాలను ఎత్తయిన ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రాల్లో అవసరమైన యంత్రాలు, కాంటాలు, టార్ఫాలిన్లు, రవాణా వాహనాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.


