రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
కామారెడ్డి టౌన్: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువులో ఈ నెల 16 నుంచి 18 వరకు జరిగే రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఉమ్మడి జిల్లా జట్టులను ఎంపిక చేసినట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి హీరాలాల్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అండర్–17 బాలుర, బాలికల జట్టులను క్రీడాకారులను ప్రకటించారు. నిజామాబాద్ నుంచి 14 మంది, కామారెడ్డి నుంచి 12 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. వ్యాయామ ఉపాధ్యాయులు స్వామి గౌడ్, అశోక్, రాజా గౌడ్, బాలయ్య, లక్ష్మణ రాథోడ్, సతీష్, శేఖర్, శ్రీనివాస్, మధు తదితరులున్నారు.
భిక్కనూరు: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఫరీదుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని చింతల స్పందన ఎంపికై ందని పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు భాస్కర్‌రెడ్డి మంగళవారం తెలిపారు. ఈ నెల 16 నుంచి 18వరకు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో స్పందన పాల్గొంటుందన్నారు. స్పందనను పాఠశాల హెచ్‌ఎం మనోహర్‌రావు, పాఠశాల చైర్మన్ సౌజన్య ఉపాధ్యాయులు అభినందించారు.
గాంధారి(ఎల్లారెడ్డి): గండివేట్ శివారులో మంగళవారం క్షేత్ర స్థాయిలో వరి పొలాలను పరిశీలించినట్లు ఏవో రాజలింగం తెలిపారు. వరి పొలాల్లో మానిపండు తెగులు, ఆకుల పై పసుపు పచ్చ మచ్చలున్నట్లు గుర్తించామన్నారు. మోతాదుకు మించి యూరియా మందును వాడకం వల్ల ఈ తెగులు ఆశిస్తుందన్నారు. సంబంధిత రైతులకు సస్యరక్షణ చర్యల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించినట్లు తెలిపారు.
కామారెడ్డి రూరల్: దేవునిపల్లి 35వ వార్డులోని దత్తాత్రేయ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాత రాజేశ్వర్‌కు విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు రాజుపాటిల్, అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి, పోచయ్య, గంగయ్య తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక


