నవంబర్‌ 27న ఫిజిక్స్‌ జాతీయ సదస్సు | - | Sakshi
Sakshi News home page

నవంబర్‌ 27న ఫిజిక్స్‌ జాతీయ సదస్సు

Oct 15 2025 7:57 AM | Updated on Oct 15 2025 7:57 AM

నవంబర

నవంబర్‌ 27న ఫిజిక్స్‌ జాతీయ సదస్సు

నవంబర్‌ 27న ఫిజిక్స్‌ జాతీయ సదస్సు మద్యం దుకాణాలకు 193 దరఖాస్తులు గ్రీస్‌లో ఉద్యోగాల కోసం దరఖాస్తుల ఆహ్వానం ఆబాస్‌లో జిల్లాకు తృతీయస్థానం

భిక్కనూరు: నిజామాబాద్‌ జిల్లా కేంద్రలోని గి రిరాజ్‌ ప్రభుత్వ కళాశాలలో నవంబర్‌ 27వ తే దీన నిర్వహించనున్న ఫిజిక్స్‌ జాతీయ సద స్సుకు సంబంధించిన వాల్‌పోస్టర్లను సౌత్‌క్యాంపస్‌లో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సుధాకర్‌గౌడ్‌ ఆద్వర్యంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కృత్రిమ మేధ యుగంలో విజ్ఞాన శాస్త్రాలకు ఉ న్న అవకాశాలు – సవాళ్లు’ అనే అంశంపై సద స్సులో చర్చ ఉంటుందని తెలిపారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉన్నతమండలి చైర్మన్‌ బాలకిష్టారెడ్డి హాజరవుతారని, అలాగే వివిధ యూనివ ర్సిటీల ప్రతినిధులు కూడా పాల్గొంటారన్నా రు. విద్యార్థులు, అధ్యాపకులు అధిక సంఖ్య లో హాజరుకావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సదస్సు ఇన్‌చార్జి రామకృష్ణ, ఫిజిక్స్‌ హెచ్‌వోడీ మోహన్‌బాబు, పాఠ్య ప్రఽణాళిక విభాగం చైర్మన్‌ హరిత, లక్కరాజు, అధ్యాపకులు లలిత, ప్రతిజ్ఞ వైశాలి, సరిత, దిలీప్‌, శ్రీమతి, నారాయణ, పోతన్న పాల్గొన్నారు.

కామారెడ్డి రూరల్‌: జిల్లాలోని 49 మద్యం దుకాణాలకు మంగళవారం నాటికి 193 దరఖాస్తులు అందినట్లు ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ హనుమంతరావు తెలిపారు. ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించి 23వ తేదీన లక్కీ డ్రా నిర్వహిస్తామన్నారు. మంగళవారం అందిన 27 దరఖాస్తులతో కలిపి ఇప్పటి వరకు ఆయా దుకాణాలకు 193 దరఖాస్తులు అందాయన్నారు. కామారెడ్డి ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలోని 15 దుకాణాలకు 54 దరఖాస్తులు, ఎల్లారెడ్డి స్టేషన్‌ పరిధిలో 7 దుకాణాలకు 25, బాన్సువాడ స్టేషన్‌ పరిధిలో 9 దుకాణాలకు 44, దోమకొండ స్టేషన్‌ పరిధిలో 8 దుకాణాలకు 32, బిచ్కుంద స్టేషన్‌ పరిధిలో 10 దుకాణాలకు 38 దరఖాస్తులు అందినట్లు ఈఎస్‌ వివరించారు.

కామారెడ్డి అర్బన్‌: టాంకామ్‌ ద్వారా గ్రీస్‌ దేశంలో హాస్పిటాలిటీ నిర్వహణ, సేవా రంగంలో వెయ్యి చట్టబద్ధమైన ఉద్యోగాల కోసం దరఖాస్తులను కోరుతున్నట్టు జిల్లా ఉపాధికల్పనాధికారి ఎం రజనీకిరణ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఇంగ్లిష్‌ నైపుణ్యం కలిగి ఉండాలని, ఉచిత బీమా, భోజన, వసతితోపాటు నెలకు జీతం రూ.92 వేల నుంచి రూ.లక్షా22 వేల వరకు ఉంటుందన్నారు. హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా, డిగ్రీ ఉన్నవారు లేదా ప్రభుత్వ నైపుణ్యం ధ్రువీకరణ పొందిన వారు దరఖాస్తు చేయొచ్చన్నారు. www.tomcom.telangana.gov. inలో గానీ, 94400 52081, 94400 51452 నంబర్లకు ఫోన్‌ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు.

గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు..

ఎల్లారెడ్డి: జిల్లాలోని తొమ్మిది సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలల్లో 2025 – 2026 విద్యా సంవత్సరానికి 5 నుంచి 9వ తరగతి వరకు మిగిలిపోయిన సీట్ల భర్తీ చేయనున్నట్లు ఎల్లారెడ్డి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ నాగేశ్వర్‌రావు తెలిపారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన నిర్వహించిన ప్రవేశపరీక్షకు హాజరై ఉండాలని, ఇప్పటి వరకు నిర్వహించిన ప్రవేశాల ప్రక్రియలో ఎక్కడా సీటు పొంది ఉండొద్దని స్పష్టం చేశారు. అర్హత, ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 16, 17 తేదీల్లో తమ సర్టిఫికెట్లు, ప్రవేశ పరీక్ష హాల్‌ టికెట్‌ తదితర ధ్రువపత్రాలతో ఎల్లారెడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని ఆయన తెలిపారు.

కామారెడ్డి టౌన్‌: వైద్యారోగ్యశాఖ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆధార్‌ బేస్డ్‌ అటెన్‌డెన్స్‌ సిస్టం(ఆబాస్‌) అమలులో రాష్ట్ర స్థాయిలో జిల్లా తృతీయ స్థానంలో నిలిచింది. ఈ మేరకు డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆబాస్‌ను జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సక్రమంగా అమలు చేయాలని అన్నారు. పీహెచ్‌సీలు, సబ్‌ సెంటర్‌లలో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, ఆబాస్‌ యాప్‌లో ఆన్‌లైన్‌ అటెన్‌డెన్స్‌ మరింత పకడ్బందీగా నమోదు చేసుకొని రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో జిల్లా నిలిచేలా కృషి చేయాలని కోరారు.

నవంబర్‌ 27న ఫిజిక్స్‌ జాతీయ సదస్సు1
1/1

నవంబర్‌ 27న ఫిజిక్స్‌ జాతీయ సదస్సు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement