పార్టీ కోసం కష్టపడ్డ వారికే పదవులు
● పార్టీని ప్రక్షాళన చేయాలని
అధిష్టానం నిర్ణయించింది
● ఏఐసీసీ జిల్లా అబ్జర్వర్ రాజ్‌పాల్ కరోల
కామారెడ్డి టౌన్: పార్టీ అభివృద్ది కోసం కష్టపడ్డ వారికే పదవులు దక్కుతాయని ఏఐసీసీ జిల్లా అబ్జర్వర్ రాజ్‌పాల్ కరోల అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ అతిథిగృహంలో మంగళవారం నిర్వహించిన నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పార్టీని ప్రక్షాళన చేయాలని అధిష్టానం నిర్ణయించిందని తెలిపారు. ఈ క్రమంలోనే డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు. నియోజకవర్గ ముఖ్య నాయకుల అభిప్రాయాలను కరోల సేకరించారు. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ.. కష్టకాలంలో పార్టీని ముందుకు నడిపించిన కై లాస్ శ్రీనివాస్‌రావునే మళ్లీ డీసీసీ అధ్యక్షుడిగా నియమించాలన్నారు. ఆయనని మార్చాలని నిర్ణయిస్తే ప్రభుత్వం ఏదైనా మంచి అవకాశం కల్పించిన తర్వాతే ఆయనను మారుస్తామన్నారు. ఈ మేరకు నియోజకవర్గ నాయకులు కై లాస్ శ్రీనివాస్‌ను డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని తీర్మానం చేశారు. సమావేశంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మహమ్మద్ ఇలియాస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, నాయకులు సందీప్, పండ్ల రాజు, గోనె శ్రీనివాస్ నియోజకవర్గంలోని నాయకులు పాల్గొన్నారు.


