టీటీఐలో సౌకర్యాలు కల్పించాలి
కామారెడ్డి క్రైం: రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించేందుకు జిల్లా కేంద్రానికి సమీపంలోని ట్రాఫిక్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ (టీటీఐ) ఎంతో అనువుగా ఉంటుందని, సౌకర్యాలు కల్పించాలని ఎస్పీ రాజేశ్‌చంద్ర అన్నారు. టీటీఐ భవనాన్ని ఎస్పీ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్ కేసుల్లో పట్టుబడిన వారికి సైతం కౌన్సెలింగ్ ఇచ్చేందుకు టీటీఐ భవనాన్ని వినియోగిస్తామన్నారు. ఇక్కడి విధులు నిర్వర్తించే సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలను కల్పించాలని రిజర్వ్‌డ్ విభాగం సీఐ సంతోష్‌కుమార్‌కు ఎస్పీ సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు.


