
శాకంబరిగా మరిడమ్మ
పెద్దాపురం : మరిడమ్మ అమ్మవారు మంగళవారం శాకంబరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక దర్గాసెంటర్ లక్కీ షాపింగ్ మాల్ యాజమాన్యం సహకారంతో మరిడమ్మ అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, పండ్లతో పండితులు అలంకరించగా అమ్మవారు శాకంబరిగా దర్శనమిచ్చారు. పెద్దాపురం సీఐ విజయశంకర్ పర్యవేక్షణలో ఎస్సై మౌనిక బందోబస్తు కల్పించారు. అనంతరం వీధి సంబరాల్లో భాగంగా కుమ్మరవీధి సంబరాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ విజయలక్ష్మి, ట్రస్టీ చింతపల్లి శ్రీహర్ష ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.