సోమశిలకు సొబగులు | - | Sakshi
Sakshi News home page

సోమశిలకు సొబగులు

Jun 29 2025 2:48 AM | Updated on Jun 29 2025 2:48 AM

సోమశి

సోమశిలకు సొబగులు

సోమశిల, అమరగిరి, నార్లాపూర్‌ వద్ద

కాటేజీల నిర్మాణం, బోట్‌ జెట్టీల ఏర్పాటు

హోంస్టేల ద్వారా స్థానికులకు ఉపాధి, ఆదాయం

జటప్రోలు, కొల్లాపూర్‌లోని పురాతన

ఆలయాల అనుసంధానం

కృష్ణాతీరంలోని సుందర ప్రాంతాలు, నల్లమలలో పర్యాటక అభివృద్ధికి రూ.68.10 కోట్లు

ఒకవైపు పచ్చని నల్లమల అభయారణ్యం, మరోవైపు నీలిరంగు పులుముకుని ప్రవహించే కృష్ణమ్మ అందాలు, నదిలో

ద్వీపపు సొబగులు, చుట్టూరా పురాతన ఆలయాలతో ఆధ్యాత్మిక శోభ.. వీటన్నింటినీ కలిపి టూరిజం సర్క్యూట్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

కృష్ణాతీరంలోని సోమశిల సర్క్యూట్‌ను ఏర్పాటు చేసి పర్యాటకంగా అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా స్పెషల్‌ అసిస్టెన్స్‌ టూ స్టేట్స్‌ ఫర్‌ కాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌

(సాస్కీ)కింద కేంద్ర ప్రభుత్వం రూ. 68.10 కోట్లను

అందించనుంది. ‘సోమశిల వెల్‌నెస్‌, స్పిరిచ్యూయల్‌ రిట్రీట్‌ నల్లమల ప్రాజెక్ట్‌’ పేరుతో నల్లమల అటవీప్రాంతంతో పాటు సోమశిల ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు టూరిజం అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

సోమశిల వద్ద కృష్ణానదిలో సిద్ధమవుతున్న లాంచీ

– సాక్షి, నాగర్‌కర్నూల్‌

సోమశిల కేంద్రంగా టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చెందితే మరింత విస్తృతంగా స్థానికులకు ఆదాయం సమకూరేందుకు అవకాశం కలగనుంది. ఇప్పటికే సోమశిలలో హోం స్టే విధానంలో తమ ఇళ్లను తీర్చిదిద్దుకున్నారు. పదుల సంఖ్యలో రిసార్ట్‌లతో పాటు వందకు పైగా ఇళ్లను హోంస్టేకు అనువుగా మలచుకున్నారు. తమ ఇళ్లలో ఉండేందుకు వసతులు కల్పించడంతో పాటు రుచికరమైన ఇంటి భోజనాన్ని పర్యాటకులకు అందిస్తున్నారు. ఆర్డర్‌పై చేపల పులుసు, కూరలు, రొట్టెలు, అన్నం ఇతర వంటకాలను పర్యాటకులకు అందిస్తున్నారు. సోమశిల గ్రామానికి వీకెండ్స్‌లో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. దీంతో నెలలో కనీసం 15 రోజుల పాటు స్థానికులు ఆదాయం పొందుతున్నారు. తమ ఇళ్లను హోంస్టేలుగా మార్చి అద్దెకు ఇస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.

ఎకో టెంపుల్‌ టూరిజం ఒకేచోట

కృష్ణానది తీర ప్రాంతాల్లోని సుందరమైన ప్రదేశాలైన సోమశిల, అమరగిరి ద్వీపం, నార్లాపూర్‌ గ్రామాల్లో కాటేజీలు, బోటింగ్‌ జెట్టీలు, వాటర్‌ స్పోర్ట్స్‌, కనెక్టింగ్‌ రోడ్లు, మౌలిక సదుపాయాలను కల్పిస్తారు. అలాగే నల్లమలలోని ఈగలపెంటలో అరైవల్‌ జోన్‌, రివర్‌ క్రూయిజ్‌, చెంచు ట్రైబల్‌ ఎక్స్‌పీరియన్స్‌ పేరుతో టూరిజం క్లస్టర్‌ ఏర్పాటు, కొల్లాపూర్‌లోని మాధవస్వామి ఆలయం, జటప్రోలులోని పురాతన మదనగోపాలస్వామి ఆలయాలను అనుసంధానిస్తూ టెంపుల్‌ సర్క్యూట్‌ను ఏర్పాటు చేస్తారు. సోమశిల సర్క్యూట్‌లోనే ఫారెస్ట్‌, ఎకో టూరిజం, టెంపుల్‌ టూరిజం, వాటర్‌ స్పోర్ట్స్‌ సౌకర్యాలను కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించనున్నారు. ఇందుకోసం అమరగిరి ద్వీప ప్రాంతంలో 18 కాటేజీలు, బోటింగ్‌ జెట్టీలు, స్విమ్మింగ్‌పూల్‌, కేఫేటేరియా, స్పా అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్‌, ఇన్‌డోర్‌, అవుట్‌ డోర్‌ గేమ్స్‌, వాటర్‌స్పోర్ట్స్‌, ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. అలాగే కొల్లాపూర్‌ పట్టణంలోని రాజావారి ప్యాలెస్‌ను సైతం సందర్శకులకు అందుబాటులో ఉంచనున్నారు. పురాతన భవనాల నిర్మాణ శైలి తో పాటు బంగ్లాలోని పురాతన ఫర్నిచర్‌, అలనాటి వైభవం, నిర్మాణ ఆకృతులను దర్శించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయనున్నారు.

కొల్లాపూర్‌లో రాజా వారి ప్యాలెస్‌

హోంస్టేల ద్వారా స్థానికులకు ఆదాయం..

సోమశిలకు సొబగులు 1
1/2

సోమశిలకు సొబగులు

సోమశిలకు సొబగులు 2
2/2

సోమశిలకు సొబగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement