వామ్మో దోమలు.. | - | Sakshi
Sakshi News home page

వామ్మో దోమలు..

Jun 29 2025 2:48 AM | Updated on Jun 29 2025 2:48 AM

వామ్మ

వామ్మో దోమలు..

గద్వాలటౌన్‌: ప్రస్తుత వర్షాకాలంలో దోమలు విజృంభిస్తున్నాయి. నిల్చున్నా.. పడుకున్నా.. దోమకాట్లు తప్పడం లేదు. దోమల సైర్వవిహారం ఎక్కువగా ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. దోమల నివారణ చర్యలకు మున్సిపాలిటీ పరంగా ఏటా రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నా.. ఫలితాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. ప్రధానంగా ఫాగింగ్‌, కాలువల్లో దోమల మందు పిచికారీ చేస్తున్నట్టు అప్పుడప్పుడు అధికారులు ప్రకటిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో కిందిస్థాయి సిబ్బంది పని తీరును పర్యవేక్షించకపోవడంతో పట్టణాలలోని కొన్ని ప్రాంతాల్లో దోమల బెడద ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ ప్రాంతాల్లో డెంగీ వంటి ప్రాణాంతక జ్వరాలు, మలేరియా, చికెన్‌ గున్యా వంటి భయాలు ప్రజానీకాన్ని వెంటాడుతున్నాయి. జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్‌, వడ్డేపల్లి మున్సిపల్‌ పట్టణాలలో ఇదే పరిస్థితి నెలకొంది.

పూడిక తీయకపోవడంతో..

ప్రధానంగా ఆయా పట్టణాలలోని కాలనీల్లో ఉన్న అంతర్గత కాలువలతో పాటు, కందకాలలో పేరుకపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించకపోవడంతో దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గద్వాల పట్టణంలో సగభాగం కందకాలు విస్తరించి ఉన్నాయి. చాలావరకు ఆక్రమణకు గురయ్యాయి. ఎగువ ప్రాంతాల నుంచి, చిన్న చిన్న కాలువల నుంచి వచ్చే మురుగునీరంతా కందకంలో కలుస్తున్నాయి. సక్రమంగా పూడిక తీయకపోవడంతో కందకాలన్ని చెత్త చెదారాలతో నిండిపోయ్యాయి. ప్రస్తుతం అడపదడపా వర్షాలు కురవటంతో ఈ కందకాల నుంచి నీరు దిగువకు పారేందుకు, సుంకులమ్మ మెట్టు వెనక భాగాన ఉన్న అవుట్‌లేట్‌ దగ్గర అనువైన డ్రైనేజీ వ్యవస్థ లేదు. ఇటీవల పట్టణంలోని ప్రధాన డ్రైనేజీలలో చేపట్టిన పూడికతీత పనులు నామమాత్రంగా సాగాయి. అయిజ, శాంతినగర్‌ వంటి పట్టణాలలో ప్రధానంగా మురుగు కాలువల్లో ప్లాస్టిక్‌ కవర్లు నిండుకున్నాయి. దాంతో మురుగునీరు పారకుండా అవి అడ్డుకుంటున్నాయి. పట్టణంలోని చాలా డ్రైయిన్లు పూడికతో నిండి మురుగు పారుదలకు ఇబ్బందిగా ఏర్పడింది. నీరు ఎటూ కదలని పరిస్థితి నెలకొంటోంది. దాంతో ఎక్కడ నీరు అక్కడే నిలచిపోవటంతో దోమల ఉద్దృతి పెరిగిపోతోంది. గద్వాలలో ఓ మోస్తారుగా... మిగిలిన అయిజ, అలంపూర్‌, వడ్డేపల్లి పట్టణాలలో దోమల నివారణ చర్యలు మచ్చుకై న కనిపించవు.

ఇళ్ల మధ్య మురుగునీరే ఆవాసాలు

పొంచి ఉన్న రోగాల భయం..

వణుకుతున్న జనం

కాల్వలను శుభ్రం చేయించాలి

దోమలను లార్వా దశలో ఉన్నప్పుడే నిర్మూలించే విధంగా పకడ్బందీ చర్యలు చేపట్టాలి. సమస్యాత్మక ప్రాంతాలలో క్రమం తప్పకుండా యాంటీలార్వా ఆపరేషన్‌ చేయించాలి. మురుగు కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించి, డంపింగ్‌ యార్డుకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలి. దోమల విజృంభణతో విషజ్వరాల భారిన పడే ప్రమాదం పొంచి ఉంది.

– శ్రీధర్‌, గద్వాల

దోమల నివారణ

చర్యలు చేపడతాం

డ్రైనేజీలో పూడుకుపోయిన వ్యర్థ పదార్థాలను, ప్లాస్టిక్‌ కవర్లను తొలగించే చర్యలను ఇటీవల చేపట్టడం జరిగింది. దోమల నివారణ కోసం తగిన చర్యలు తీసుకుంటాం. ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాం. కాలనీలలో ఫాగింగ్‌ యంత్రాలను వినియోగించడంతో పాటు దోమల నివారణ మందులను చల్లుతున్నాం.

– దశరథ్‌, కమిషనర్‌, గద్వాల

వామ్మో దోమలు.. 1
1/2

వామ్మో దోమలు..

వామ్మో దోమలు.. 2
2/2

వామ్మో దోమలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement