చిన్న కాళేశ్వరం పనుల్లో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

చిన్న కాళేశ్వరం పనుల్లో వేగం పెంచాలి

Jun 29 2025 2:48 AM | Updated on Jun 29 2025 2:48 AM

చిన్న కాళేశ్వరం పనుల్లో వేగం పెంచాలి

చిన్న కాళేశ్వరం పనుల్లో వేగం పెంచాలి

కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

భూపాలపల్లి: చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అన్నారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనుల ప్రగతిపై ఇరిగేషన్‌, ఫారెస్ట్‌, రెవెన్యూ శాఖల అధికారులతో పాటు మెగా కంపెనీ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఆధునీకరణలో ఉన్న చెరువులు, కాలువలు, పంప్‌హౌస్‌ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. భూసేకరణ సమస్యలు ఉన్న గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి గ్రామస్తులతో తీర్మానం చేయించాలని సూచించారు. ఈ సమావేశంలో కాటారం సబ్‌ కలెక్టర్‌ మయాంక్‌సింగ్‌, అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌, డీఎఫ్‌ఓ నవీన్‌రెడ్డి, ఇరిగేషన్‌ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement