
మత్తుపదార్థాలపై అప్రమత్తంగా ఉండాలి
● సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్
జనగామ రూరల్: మత్తుపదార్థాల విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ అన్నారు. ‘డీఏడబ్ల్యూఎన్, డ్రగ్ అవేర్నెస్ అండ్ వెల్నెస్ నావిగేషన్ ఫర్ ఏ డ్రగ్– ఫ్రీ ఇండియా స్కీం – 2025’పై ఓబుల్‌కేశవపూర్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. డ్రగ్స్ అమ్మేవారు స్కూల్ విద్యార్థులను టార్గెట్ చేస్తున్నారని, జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పా రు. ఈ సందర్భంగా డ్రగ్స్‌తో కలిగే అనర్థాల గురించి వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు శేఖర్, జితేంద్ర, విద్యార్థులు పాల్గొన్నారు.