
పొదుపు పథకం బాగుంది
చేనేత వృత్తి నిరాధరణకు గురవుతున్న సమయంలో నాడు కేసీఆర్, నేడు రేవంత్‌రెడ్డి అమలు చేస్తున్న నేతన్న పొదుపు పథకం కింద రెట్టింపు బోనస్ కలిపి ఇవ్వడంతో ఆర్థికంగా బలపడుతున్నాం. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనూ నెలకు రూ.1,200 చెల్లిస్తే మరో రూ.2,400 కలిపి మూడేళ్లకు గాను రూ.1,29,600 రెండుసార్లు తీసుకున్నాను. నాతో పాటు భార్య కూడా నెలకు రూ.600 చెల్లిస్తే, ప్రభుత్వం రూ.1,200 బోనస్‌తో మూడేళ్లకు రూ.64,800 ఇచ్చింది. గత ప్రభుత్వం మూడేళ్లకు బోనస్ ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్కీంను రెండేళ్లకు కుదించడంతో కార్మికులకు త్వరగా లబ్ధి చేకూరుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ మగ్గం నేసే కార్మికులకు చేయూత కొనసాగించడం అసరాగా నిలుస్తుంది.
– చింతకింది సోమయ్య, చేనేత కార్మికుడు, కోలుకొండ(దేవరుప్పుల)