హైకోర్టు జడ్జిని అందించిన జోగిన్‌పెల్లి స్కూల్‌ | - | Sakshi
Sakshi News home page

హైకోర్టు జడ్జిని అందించిన జోగిన్‌పెల్లి స్కూల్‌

Jun 13 2025 5:27 AM | Updated on Jun 13 2025 5:27 AM

హైకోర్టు జడ్జిని అందించిన జోగిన్‌పెల్లి స్కూల్‌

హైకోర్టు జడ్జిని అందించిన జోగిన్‌పెల్లి స్కూల్‌

కోరుట్ల రూరల్‌: మండలంలోని జోగిన్‌పెల్లి ప్రభుత్వ పాఠశాలలో చదివిన గ్రామానికి చెందిన ఏనుగు సంతోష్‌ రెడ్డి హైకోర్టు జడ్జిగా ఎదిగారు. రెండేళ్ల క్రితం ఉద్యోగ విరమణ పొందారు. జిల్లా డిప్యూటీ సీఈఓ పల్లికొండ నరేశ్‌, పిల్లల వైద్య నిపుణుడు బూరుగు నారాయణ, శ్రీరాంసాగర్‌ చీఫ్‌ సూపరింటెండెంట్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఏనుగు రాజరెడ్డి ఈ పాఠశాలలోనే విద్యనభ్యసించారు. ఈ పాఠశాలలో చదివిన ఎంతో మంది ప్రభుత్వ ఉపాద్యాయులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, బ్యాంకు అధికారులుగా ఎదిగారు. వందలాది మంది ఉన్నత ఉద్యోగాలు చేస్తూ పాఠశాల పేరును నిలబెడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement