మున్సిపల్‌ అభివృద్ధి అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ అభివృద్ధి అందరి బాధ్యత

Jun 3 2025 5:33 AM | Updated on Jun 3 2025 5:33 AM

మున్సిపల్‌ అభివృద్ధి అందరి బాధ్యత

మున్సిపల్‌ అభివృద్ధి అందరి బాధ్యత

జగిత్యాల: మున్సిపల్‌ అభివృద్ధి అందరి బాధ్యతని, పచ్చదనం– పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్‌ కమిషనర్‌ స్పందన అన్నారు. డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రూపొందించిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా తొలిరోజు సోమవారం పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ, ప్రజలు తమవంతుగా పచ్చదనం పరిశుభ్రత ప్రారంభించాలని, 100 రోజుల కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని, ఇందులో ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ఉంటుందని చెప్పారు. అనంతరం మహిళ సంఘాలు తయారుచేసిన ఉత్పత్తులను పాతబస్టాండ్‌లో మేళా నిర్వహించారు. ర్యాలీ నిర్వహించి పాతబస్టాండ్‌లో ప్రతిజ్ఞ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మెప్మా ఏవో శ్రీనివాస్‌, సునీత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement