Russia Ukraine War: షాపింగ్‌ మాల్‌, సూపర్‌ మార్కెట్‌పై దాడి.. ఉక్రేనియులు మృతి.. వీడియో వైరల్‌

Russian Troops Bomb Attack On shopping Center - Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌లో రష్యా దాడులు 26వ రోజుకు చేరుకున్నాయి. రష్యా బలగాల ధాటికి ఉక్రెయిన్‌ విలవిలాడుతోంది. రష్యా వైమానిక దాడుల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఉక్రెయిన్‌ జనావాసాలే లక్ష్యంగా రష్యా ట్రూప్‌ దాడులు జరుపుతున్నాయి. కనీస కనికరం లేకుండా బాండు దాడులు చేస్తున్నాయి.

తాజాగా ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్‌లో ఉన్న రెట్రోవిలీ షాపింగ్ మాల్‌పై ర‌ష్యా మిస్సైల్ దాడి చేసింది. ఆ దాడిలో ఆరుగురు మృతిచెందారు. దాడి కారణంగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, మారియ‌పోల్‌లో ర‌ష్యా యుద్ధ నేరాల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. న‌గ‌రంలోని 90 శాతం బిల్డింగ్‌లో ఇప్ప‌టికే ధ్వంసం అయ్యాయి. ఆ న‌గ‌రంలో ఇంకా మూడు ల‌క్ష‌ల మంది త‌ల‌దాచుకుంటున్నారు. వాళ్ల‌కు విద్యుత్తు, నీరు, ఆహారం అంద‌డం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు.. ఖార్కీవ్‌లో ఓ సూపర్‌ మార్కెట్‌పై రష్యా బలగాలు దాడులు చేశాయి. దాడుల్లో షాపులో ఉన్న ఉక్రెయిన్‌ పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంక్షోభంలో ఉక్రెయిన్‌కు చెందిన మాజీ ఎంపీ భార్య డబ్బును తరలిస్తూ పోలీసులకు చిక్కారు. మాజీ ఎంపీ కొట్విట్స్కీ భార్య భారీ మొత్తంలో ఉక్రెయిన్‌ నుంచి డబ్బును తరలిస్తుండగా హంగేరిలో బోర్డర్‌లో పోలీసులు పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా, బాంబు దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top