కుప్పకూలిన రొమేనియా ప్రభుత్వం | Romania Government Collapses as Pro-EU PM Bolojan Ousted in Shock No-Confidence Vote | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన రొమేనియా ప్రభుత్వం

May 6 2026 4:20 AM | Updated on May 6 2026 4:20 AM

Romania Government Collapses as Pro-EU PM Bolojan Ousted in Shock No-Confidence Vote

బుకారెస్ట్‌: రొమేనియాలోని యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ)అనుకూల కూటమి ప్రభుత్వం కుప్పకూలింది. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ప్రధానమంత్రి ఇలీ బొలొజన్‌ సారథ్యంలోని ప్రభుత్వం రాజీనామా చేసింది. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 281 మంది, వ్యతిరేకంగా కేవలం నలుగురే ఓటేశారు. ఏడాది క్రితమే ఈ ప్రభుత్వం ఏర్పాటు కావడం గమనార్హం.

గతవారం అధికార కూటమిలోని సోషల్‌ డెమోక్రాటిక్‌ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో, అలయెన్స్‌ ఫర్‌ ది యూనిటీ ఆఫ్‌ రొమేనియన్స్‌ (ఏయూఆర్‌) పార్లమెంట్‌లో తాజాగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని కృత్రిమం, కపటం అంటూ ప్రధాని బొలొజన్‌ కొట్టిపారేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement