ఏంది బ్రో అది: మొసలిని దగ్గరికి తీశాడు, ఆపై ఊహించని రీతిలో..

Man Feed Crocodile Like Baby Video Viral - Sakshi

వైరల్‌: ఎవరైనా ఏ కుక్కనో, పిల్లినో సాదుకుంటారు. కొంచెం రిస్క్‌ అయినా సరే.. వన్య మృగాలను సైతం పెంచుకుంటారు కొందరు. కానీ, ఏ కండకు ఆ కండను పీక్కుతినే మొసలితో పరాచికాలు ఆడతారా?

తాజాగా ఇంటర్నెట్‌ను పదిహేను సెకన్ల నిడివి ఉన్న ఓ వీడియో కుదిపేస్తోంది. ఏదో చంటిబిడ్డలా కాళ్ల సందులో మొసలిని ఉంచుకుని.. దాని నోటికి ఆడిస్తూ ఆహారం అందించాడు ఓ వ్యక్తి. పైగా దాని మూతి మీద తట్టి మరీ అభినందించడంతో ఆది నీళ్లలోకి తిరుగు టపా కట్టింది. ‘ఇదేం తరహా పెంపుడు జీవి బ్రో’ అంటూ ఫైజెన్‌ అనే ట్విటర్‌ యూజర్‌ పోస్ట్‌ చేశారు. నాలుగున్నర మిలియన్ల వ్యూస్‌ పూర్తి చేసుకున్న  ఆ వీడియోను మీరూ చూసేయండి. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top