చరిత్ర సృష్టించిన కమలా హారిస్

Kamala Harris, Making History As Vice President Pick - Sakshi

అమెరికా ఉపాధ్యక్ష పదవికి డెమోక్రాట్ అభ్యర్థిగా కమలా హారిస్ నామినేషన్

వాషింగ్టన్ : అమెరికా ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ స్వీకరించి కమలా హారిస్ చరిత్ర సృష్టించారు. ప్రధాన పార్టీ డెమొక్రటిక్ పార్టీ తరఫున అమెరికా ఉపాధ్యక్ష పదవికి  పోటీకి దిగిన మొదటి నల్లజాతి మహిళగా హారిస్ రికార్డులకెక్కారు.  అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా,హిల్లరీ క్లింటన్ల సమక్షంలో నవంబరులో జరగనున్న ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థిగా ఆమె నామినేట్ అయ్యారు.

ఈ సందర్భంగా ప్రసంగించిన ఆమె అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై విమర్శల వర్షం కురిపించారు. ట్రంప్ ప్రభుత్వం వైఫల్యం ప్రజల జీవితాలను జీవనోపాధిని నాశనం చేసిందంటూ మండి పడ్డారు. మన బాధల్ని, విషాదాలను రాజకీయ ఆయుధాలుగా మలుచుకున్న ట్రంప్ ను ఓడించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే మన సవాళ్లను స్వీకరించి విజయాలుగా మలిచే, మనందరినీ ఏకతాటిపైకి తెచ్చే అధ్యక్షుడిగా జో బిడెన్‌కు ఓటు వేసి గెలిపించాలని అమెరికన్లను కోరారు. తన తల్లి నేర్పిన విలువలకు, బిడెన్  విజన్ కు కట్టుబడి ఉంటానంటూ ట్వీట్ చేశారు.

అనంతరం అమెరికా తొలి నల్లజాతి అద్యక్షుడైన బరాక్ ఒబామా ప్రసంగిస్తూ  బిడెన్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు.  కాగా నవంబరు 3న జరగనున్న ఎన్నికల్లో ఒపీనియన్ పోల్ లో ట్రంప్ కంటే జో బిడెన్   ముందంజలో ఉన్నారు. ప్రధానంగా మహిళా ఓటర్లలో ఆధిక్యతను చాటుకుంటున్నారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top