జేమ్స్‌ బాండ్‌కు అరుదైన గౌరవం

An Asteroid Named After James Bond Actor Sean Connery - Sakshi

వాషింగ్టన్‌: అంతరిక్షంలోని ఒక గ్రహశకలానికి ఇటీవల మరణించిన ప్రముఖ హాలీవుడ్‌ నటుడు సీన్‌ కానరీ పేరును అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)  పెట్టింది. జేమ్స్‌బాండ్‌ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా కానరీ ఎంత ప్రాచుర్యం సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాండ్‌ జేమ్స్‌ బాండ్‌ అంటూ ఆయన పేరు దేశ విదేశాలలో మారుమ్రోగింది. అందుకే  ఆయన గౌరవార్థం, ది నేమ్‌ ఆఫ్‌ ద రోజ్’ చిత్రంలో ఆయన ప్రతిభకు గుర్తుగా ఒక ఆస్ట్రనాయిడ్‌కు సీన్‌ కానరీ పేరు పెట్టినట్లు నాసా తెలిపింది.  సీన్ కానరీ 1979లో మీటియర్‌ (ఉల్కపాతం) అనే  చిత్రంలో నటించారు.  గ్రహశకలం, భూమిని ఢీకొట్టకుండా నాసా ఎలా కాపాడింది అనే నేపథ్యంలో ఆ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో కానరీ ముఖ్యపాత్ర పోషించారు.

నాసా తన మొదటి ప్లానెటరీ డిఫెన్స్ ఆఫీసర్‌ను నియమించడానికి కంటే దశాబ్దాల ముందుగానే ఆయన ఈ పాత్రను పోషించారు అని నాసా సోమవారం తాను చేసిన  ఒక ట్వీట్‌లో పేర్కొంది. ఇదిలా వుండగా అంగారక, గురు గ్రహాల మధ్య ఇటీవల కనుగొన్న ఉల్కకు సీన్‌కానరీ పేరును పెట్టింది. ఆయన పేరులాగే ఇది ఎంతో కూల్‌గా ఉందని ఆ ఉల్క గురించి నాసా అభివర్ణించింది. లెమ్మన్‌ శిఖరంపైనున్న 1.5 మీటర్ల సర్వే టెలిస్కోప్‌ ద్వారా ఆస్టరాయిడ్ 13070 సీన్‌ కానరీని ఈ ఏడాది ఏప్రిల్ 4న నాసా గుర్తించింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా  నాసా ఇటీవల తన ట్విటర్‌ ద్వారా షేర్‌ చేసింది.  జేమ్స్‌ బాండ్‌గా ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన సీన్‌ కానరీ 90 ఏళ్ల వయసులో అక్టోబర్‌ 31వ తేదీన కన్నుమూసిన సంగతి తెలిసిందే.  

చదవండి: తొలి బాండ్‌ సీన్‌ కానరీ ఇక లేరు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top