వరంగల్ లీగల్: వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎం.సాయికుమార్‌ను హైదరాబాద్ ఏడో చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌గా బదిలీ చేస్తూ.. హైకోర్టు రిజిస్టార్ జనరల్ (విజిలెన్స్) గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సీనియర్ సివిల్ జడ్జిల బదిలీల్లో భాగంగా భూపాలపల్లి సినియర్ సివిల్ జడ్జి ఎ.నాగరాజు గద్వాల ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా బదిలీకాగా.. జనగామ సినియర్ సివిల్ జడ్జి ఇ.సుచరితను రంగారెడ్డి జిల్లా రాజేందర్‌నగర్‌లోని ప్రిన్సిపల్ సీనియర్ జడ్జిగా బదిలీ చేశారు. బదిలీ అయిన న్యాయమూర్తులు ఈనెల 20వ వరకు చార్జ్ అప్పగించి 25వ తేదీలోపు బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వుల్లో రిజిస్ట్రార్ జనరల్ ఆదేశించారు.


