ప్రభుత్వం చొరవ చూపాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం చొరవ చూపాలి

Apr 17 2026 11:26 AM | Updated on Apr 17 2026 11:26 AM

ప్రభుత్వం చొరవ చూపాలి

పవర్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర

ప్రధాన కార్యదర్శి శశికుమార్‌

హన్మకొండ: ఆర్టిజన్‌ ఉద్యోగులు, అన్‌మ్యాన్డ్‌ వర్కర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని బీఎంఎస్‌ అనుబంధ తెలంగాణ రాష్ట్ర పవర్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నె శశికుమార్‌ డిమాండ్‌ చేశారు. ఆర్టిజన్ల సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. కార్యక్రమంలో టీఆర్‌పీఈయూ నాయకులు మహేశ్‌, వెంకటరమణ, ఆర్టిజన్‌ జేఏసీ హనుమకొండ జిల్లా చైర్మన్‌ కోరుకొప్పుల రాంబాబు. నాయకులు రాపాక రవీందర్‌, మట్ల భిక్షపతి, నల్ల రాంబాబు, మహేందర్‌, అన్నం రాజు, గజ్జల కుమార్‌ పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాలి:

ఎర్రబెల్లి ప్రదీప్‌రావు

ఆర్టిజన్‌ ఉద్యోగులు, ఆన్‌మ్యాన్డ్‌ వర్కర్ల అపరిష్కృత సమస్యలు వెంటనే పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు, వరంగల్‌ అర్బన్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌ చైర్మన్‌ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు డిమాండ్‌ చేశారు. హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్‌ హనుమకొండ సర్కిల్‌ కార్యాలయం వద్ద సమ్మె చేస్తున్న ఆర్టిజన్‌ ఉద్యోగులు, ఆన్‌మ్యాన్డ్‌ వర్కర్లను కలిసి ఎర్రబెల్లి ప్రదీప్‌రావు సంఘీభావం తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement