వ్యక్తిగత వివరాలు.. కుటుంబ నేపథ్యం.. | - | Sakshi
Sakshi News home page

వ్యక్తిగత వివరాలు.. కుటుంబ నేపథ్యం..

Feb 25 2026 10:44 AM | Updated on Feb 25 2026 10:44 AM

వ్యక్తిగత వివరాలు.. కుటుంబ నేపథ్యం..

వ్యక్తిగత వివరాలు.. కుటుంబ నేపథ్యం..

పేరు: బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ వయస్సు: 47 సంవత్సరాలు స్వస్థలం: కాల్వపల్లి గ్రామం, తాడ్వాయి మండలం, ములుగు జిల్లా. మావోయిస్టు పార్టీలో హోదా: తెలంగాణ రాష్ట్ర కమిటీ (టీఎస్‌సీ) కార్యదర్శి. తండ్రి పేరు: బడే ఎల్లయ్య (రైతు) తల్లి పేరు: బడే బతుకమ్మ

(లక్ష్మమ్మ). ఇతర కుటుంబసభ్యులు: ఇద్దరు సోదరులు, నలుగురు అక్కాచెల్లెళ్లు (వీరిలో ఒక సోదరుడు, ఇద్దరు అక్కాచెల్లెళ్లు చనిపోయారు) వివాహ జీవితం: జనవరి 2001లో ఏటూరునాగారం మండలం గోగుపల్లి గ్రామానికి చెందిన ఎర్ర నర్సమ్మ అలియాస్‌ సబితతో వివాహం, 2012లో ఎన్‌కౌంటర్‌లో సబిత మృతి, అక్టోబర్‌ 2016లో చర్ల ఎల్‌ఓఎస్‌ సభ్యురాలు మడకం కోసి అలియాస్‌ రజితతో వివాహం కాగా 2022లో ఆమె అరెస్టయి ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌ జైలులో ఉన్నారు.

సగర్వంగా స్వాగతం పలుకుతాం..

చదువుకున్న రోజుల్లో నేను, దామోదర్‌ స్నేహితులం. కాల్వపల్లి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన వారిలో ఏడుగురు మృతి చెందారు. ప్రస్తుతం దామోదర్‌ పోలీసుల ఎదుట లొంగిపోవడం సంతోషంగా ఉంది. ఆయనకు గ్రామస్తులమందరం సగర్వంగా స్వాగతం పలుకుతాం. దామోదర్‌ లొంగుబాటు స్నేహితుడిగా నాకు ఎంతో సంతోషంగా ఉంది.

– కొప్పుల జగన్నాథరావు, దామోదర్‌ స్నేహితుడు, కాల్వపల్లి

Advertisement
 
Advertisement
Advertisement