చెరబండరాజు కాలనీ సందర్శన..
రామన్నపేట : నగరంలోని 11వ డివిజన్ చెరబండరాజు నగర్ కాలనీని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యుడు కొంకటి లక్ష్మీనారాయణ సోమవారం సందర్శించారు. కొద్దిరో జులుగా కాలనీవాసులకు మంచినీరు సరఫరా నిలిచిపోవడంతో పడిన ఇబ్బందులు, వారిని ఖాళీ చేయాలన్న ఆదేశాలను తెలుసుకున్న ఆయన.. వెంటనే జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌కు ఫోన్ చేసి పూర్తి నివేదికతో తమ కమిషన్ ఆఫీస్‌కు రావాలని ఆదేశించారు. అనంతరం చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ దేవాలయ అధికారులు.. దళితులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేసినా శిక్షార్హులవుతారని తెలిపారు. విద్యుత్ అధికారులు కరెంట్ అందించాలని, పోలీస్ అధికారులు సైతం ఎలాంటి ఇబ్బందులు పెట్టరాదని ఆదేశించారు. అనంతరం భద్రకాళ్లి దేవస్థానం ఎదురుగా దళితబంధు పథకంకింద ఏర్పాటు చేసిన హోటల్‌ను మున్సిపల్ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తొలగించిన తీరును పరిశీలించి బాధ్యులైన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్, కంజర్ల మనోజ్, కొడకండ్ల సదంత్, ప్రదీప్, దశరథ్, రఘ, అనిల్, సాయి, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.
కాలనీవాసులతో మాట్లాడిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య
పూర్తి నివేదికతో రావాలని బల్దియా కమిషనర్‌కు ఆదేశం


