తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీ
హసన్‌పర్తి : తాళం వేసి ఉన్న రెండు ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు.ఈ ఘటన కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఈమేరకు బాధితులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పీఎస్ పరిధి లోని సప్తగిరి–6 కాలనీకి చెందిన సిద్దంశెట్టి నిఖిల్ దంపతులు బ్యాంకు ఉద్యోగులు. బుధవారం ఇంటికి తాళం వేసి విధులకు వెళ్లారు. రాత్రికి ఇంటికి వచ్చే సరికి తలుపు ధ్వంసం చేసి కనిపించింది. లోపలికి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న సుమారు 8 తులాల బంగారు ఆభరణాలు మాయమైనట్లు గుర్తించారు. మరో ఘటనలో పక్కనే ఉన్న పరిమళ కాలనీ–22లోని రమేశ్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంటిలో చోరీ జరిగింది. బుధవారం తుది దశ ఎన్నికల సందర్భంగా రమేశ్ విధులకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చే సరికి ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటనలో దొంగలు బీరువాను ధ్వంసం చేసి 5 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీస్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ ఘటనాస్థలాలకు చేరుకుని జాగీలాలతో గాలింపు చర్యలు చేపట్టారు. వేలిముద్ర నిపుణులు ఆధారాలు సేకరించారు.
13 తులాల బంగారు ఆభరణాలు మాయం
కేయూ పీఎస్ పరిధిలో ఘటన


