భద్రతానైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలి
హన్మకొండ: రోడ్డు భద్రతా నైపుణ్యాన్ని మరింత మెరుగు పరుచుకోవాలని టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను అన్నారు. గురువారం వరంగల్ ములుగు రోడ్డులోని ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో అద్దె బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రత– సురక్షిత డ్రైవింగ్ –నైపుణ్య అభివృద్ధిపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎం డి.విజయభాను మాట్లాడుతూ డ్రైవర్లు సురక్షిత డ్రైవింగ్ చేయాలని సూచించారు. బస్సు నడుపడంలో నైపుణ్యాన్ని పెంచుకోవాలని, జీరో ప్రమాదాలే లక్ష్యంగా ప్రతి డ్రైవర్ తన వృత్తి సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు. ప్రమాద రహిత డ్రైవింగ్ లక్ష్యంగా ప్రతి డ్రైవర్ పనిచేయాలని పిలుపునిచ్చారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ మాట్లాడవద్దని కోరారు. ప్రతి డ్రైవర్ సరైన పోషకాహారం తగిన విశ్రాంతి తీసుకోవాలన్నారు. కొన్ని సమయాల్లో ప్రమాదాలను నివారించడానికి చాకచక్యంగా డ్రైవింగ్ చేయాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. శిక్షణలో డిప్యూటీ ఆర్‌ఎం కేశరాజు భా నుకిరణ్, వరంగల్ రీజియన్‌లోని అన్ని డిపోల ను ంచి ఎంపిక చేసిన అద్దె బస్సు డ్రైవర్లు పాల్గొన్నారు.
ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయ భాను


