సైన్స్ ఫెయిర్‌కు సర్వం సిద్ధం
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాస్థాయి విద్యావైజ్ఞానిక ప్రదర్శన (సైన్స్ ఫెయిర్)కు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. హనుమకొండ విద్యానగర్‌లోని సెయింట్ పీటర్స్ ఎడ్యూస్కూల్‌లో శుక్ర, శనివారాల్లో విద్యావైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. వికసిత్‌భారత్, ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా శాస్త్రసాంకేతికత, గణితం, ఇంజనీరింగ్ ప్రధాన ఇతివృత్తంగా ఈ ప్రదర్శనలు ఉంటాయి.
ఏడు ఉప అంశాలతో ఎగ్జిబిట్లు
జిల్లా విద్యావైజ్ఞానిక ప్రదర్శనలో ఉప అంశాల ఎగ్జిబిట్లు ఉంటాయి. సుస్థిర వ్యవసాయం, వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం, గ్రీన్ ఎనర్జీ, ఉద్భవిస్తున్న సాంకేతికత, గణిత నమూనాలు, ఆరోగ్యం, పరిశుభ్రత, నీటి సంరక్షణ నిర్వహణ అనే ఏడు ఇతివృత్తాల అంశాలతో విద్యార్థులు ఎగ్జిబిట్లు ప్రదర్శించనున్నారు. 300 మంది విద్యార్థులు తమ గైడ్‌టీచర్లతో హాజరుకానున్నారు.
ఇన్‌స్పైర్‌కు 93 మంది విద్యార్థులు
ఇన్‌స్పైర్‌కు 93 మంది విద్యార్థులు హాజరై ఎగ్జిబిట్లు ప్రదర్శించనున్నారు. ఒక్కో విద్యార్థి కేంద్ర ప్రభుత్వంలోని సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా రూ.10 వేల చొప్పున అవార్డు పొందారు.
రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు..
జిల్లాస్థాయి విద్యావైజ్ఞానిక ప్రదర్శనకు గురువారం మధ్యాహ్నం నుంచి విద్యార్థులు తమ ఎగ్జిబిట్లు, గైడ్ టీచర్లతో సెయింట్ పీటర్స్ ఎడ్యూ స్కూల్‌కు చేరుకున్నారు. ఎగ్జిబిట్ల ప్రదర్శనకు సంబంధిత ఉపాధ్యాయ కమిటీల వద్ద రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించారు. సాయంత్రం 5 గంటలరకు 170 మంది సైన్స్ ఫెయిర్‌కు, 70 మంది ఇన్‌స్పైర్ ఎగ్జిబిట్లతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎగ్జిబిట్ల కోసం గదులను కేటాయించారు. మిగిలిన విద్యార్థులు కూడా శుక్రవారం ఉదయం వరకు చేరుకుంటారు.
విద్యావైజ్ఞానిక ప్రదర్శనకు ఏర్పాట్లు : డీఈఓ
జిల్లా విద్యావైజ్ఞానిక ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు హనుమకొండ డీఈఓ ఎల్‌వీ గిరిరాజ్‌గౌడ్ తెలిపారు. గురువారం సాయంత్రం హనుమకొండలోని సెయింట్ పీటర్స్ ఎడ్యూ స్కూల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన విద్యావైజ్ఞానిక ప్రదర్శనలకు సంబంఽధించిన వివరాలను వెల్ల డించారు. సైన్స్‌ఫెయిర్‌లో విద్యార్థులు ఎగ్జిబిట్లను ప్రదర్శిస్తారని తెలిపారు. ఈనెల శుక్రవారం ఉదయం 10 గంటలకు విద్యావైజ్ఞానిక ప్రదర్శనల ప్రారంభోత్సవానికి పలువురు ప్రజాప్రతినిధులు, కలెక్టర్, అధికారులు హాజరవుతారని వివరించారు. 20న సాయంత్రం ముగింపు కార్యక్రమంలో బహుమతుల ప్రదానం ఉంటుందన్నారు. జిల్లాస్థాయిలో ప్రతిభచూపిన విద్యార్థుల ఎగ్జిబిట్లను రాష్ట్రస్థాయికి కూడా ఎంపిక చేస్తారని తెలిపారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభచూపితే జాతీయ స్థాయి ప్రదర్శనలకు కూడా అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ మండలాల విద్యార్థులు ఎగ్జిబిట్లను తిలకించేందుకు కూడా ఏర్పాట్లు చేశామని తెలిపా రు. విద్యావైజ్ఞానిక ప్రదర్శనకు 15 కమిటీలు ఏర్పా టు చేశామని, విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాసస్వామి, జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్‌రెడ్డి, ఎంఈఓలు నెహ్రూనాయక్, బి.మనోజ్‌కుమార్, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ ఎసదానందం, గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణ, సెయింట్ పీటర్స్ ఎడ్యూస్కూల్ అఽఽధినేత నారాయణరెడ్డి, వడుప్సా అధ్యక్షుడు సతీష్‌కుమార్, బాధ్యులు ముక్తీశ్వశ్వర్‌రావు ,శ్రీకాంత్‌రెడ్డి, టీఆర్‌టీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎల్.నరేందర్‌నాయక్ పాల్గొన్నారు.
నేడు, రేపు ఎగ్జిబిట్లు ప్రదర్శించనున్న విద్యార్థులు
హనుమకొండ సెయింట్ పీటర్స్
ఎడ్యూస్కూల్‌లో ఏర్పాట్లు


