సమన్వయంతో ఎన్నికలు ప్రశాంతం
వరంగల్ క్రైం: అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించడంతో కమిషనరేట్ పరిధిలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌్‌ప్రీత్ సింగ్ అన్నారు. గురువారం డీసీపీలు అంకిత్‌కుమార్, రాజమహేంద్రనాయక్, కవిత సీపీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీపీ సన్‌ప్రీత్‌సింగ్ మాట్లాడుతూ డీసీపీ నుంచి మొదలుకొని హోంగార్డు స్థాయి వరకు అందరూ ప్రణాళికాబద్ధంగా పనిచేశారని తెలిపారు. పోలింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా బందోబస్తు నిర్వహించి ఎన్నికలను విజయవంతంగా పూర్తిచేశామని ఆయన పేర్కొన్నారు.
హన్మకొండ: తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ (బీఎంఎస్ అనుబంధం) టీజీ ఎన్పీడీసీఎల్ కంపెనీ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఈది వెంకట రమణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నే శశికుమార్ తెలిపారు. హనుమకొండలో గురువారం జరిగిన యూనియన్ ఎన్పీడీసీఎల్ కార్యవర్గ సమావేశంలో వెంకటరమణను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తనను ఎన్నుకున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశికుమార్, ఎన్పీడీసీఎల్ శాఖ అధ్యక్షుడు ఆర్.రమణారెడ్డి, కార్యవర్గ సభ్యులకు వెంకటరమణ కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని, యూనియన్ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
కేయూ క్యాంపస్: యాంటీ సెక్సువల్ హరాస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఈనెల 20న(శనివారం) ఉదయం 10:30 గంటలకు కేయూలో అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి, గౌరవ అతిథిగా రిజిస్ట్రార్ రామచంద్రం, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి వీబీ నిర్మలా గీతాంబ కీలకోపన్యాసం చేయనున్నారు. వరంగల్ షీ టీం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె.సుజాత, కేయూ ఉమెన్ స్టడీస్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.శోభ, కేయూ పాలక మండలి సభ్యురాలు డాక్టర్ కె.అనితారెడ్డి, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్, కేయూ స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ మామిడాల ఇస్తారి పాల్గొంటారని కేయూ యాంటీ సెక్సువల్ సెల్ డైరెక్టర్ డాక్టర్ మేఘనారావు తెలిపారు.
ప్రముఖ న్యాయవాది రామారావు
ఫిర్యాదుతో కేసు నమోదు
ఎంజీఎం: వరంగల్ సీకేఎం ఆస్పత్రిలో ఎలుకల సంచారం ఘటనను మానవహక్కుల సంఘం (హెచ్‌ఆర్‌సీ) తీవ్రంగా పరిగణించింది. పిల్లల వార్డులో తల్లులతోపాటు శిశువులు సైతం గాయాలపాలైన ఘటనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ న్యాయవాది రామారావు మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఆస్పత్రిలో సెక్యూరిటీ, పరిశుభ్రత గురించి అనేక సందేహాలు వస్తున్నాయి. ఎలుకలు ఆస్పత్రి వార్డులోనే కాకుండా కారిడార్లు, శిశువుల ఊయల దగ్గర కూడా తిరుగుతున్నా ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోకపోవడం గమనార్హం. ఆస్పత్రిలో ఎలుకలు తిరుగుతున్నట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడం ఆశ్చర్యానికి గురిచేసిందని న్యాయవాది పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించాలని ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ కిస్ట్రినా జడ్‌చోంగ్త్‌ను ఆయన కోరారు.
సమన్వయంతో ఎన్నికలు ప్రశాంతం
సమన్వయంతో ఎన్నికలు ప్రశాంతం


